హైద్రాబాద్ ఫిబ్రవరి 11 (way2newstv.in)
మూడు రోజుల నుంచి తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు అటూ...ఇటూ అన్నట్లు కొనసాగుతున్నాయి. సంక్రాంతి తర్వాత కూడా వణికించే చలి రెండు రోజుల క్రితం హఠాత్తుగా తగ్గింది. మళ్లీ ఆదివారం నాటికి మార్పు కనిపించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి, ఆవర్తనాల ప్రభావం కారణంగా రెండు రోజులపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్పినా అవకాశం లేకుండా పోయింది.
రాత్రి, పగటి ఉష్ణోగ్రతల్లో పెరుగుదల
కడప జిల్లా రాజంపేటలో మాత్రమే ఒక సెంటిమీటరు వర్షపాతం నమోదయింది. ప్రస్తుతం ద్రోణి ప్రభావం కూడా బలహీనపడిందని వాతావరణ శాఖ చెబుతోంది. శుక్రవారం వరకు రెండు రాష్ట్రాల్లో చలి వణికించింది. పగటి ఉష్ణోగ్రతల్లో కొంత పెరుగుదల కనిపించినప్పటికీ రాత్రి ఉష్ణోగ్రతల్లో గణనీయమైన తగ్గుదల నమోదయింది. శనివారం నుంచి రాత్రి, పగటి ఉష్ణోగ్రతల్లో పెరుగుదల కనిపించింది. తెలంగాణ, రాయలసీమ, కోస్తాంధ్రల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాయల సీమలో రాత్రి ఉష్ణోగ్రతలు 2 నుంచి 5 డిగ్రీలు, కోస్తాలో 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా నమోదయ్యాయి
No comments:
Post a Comment