Breaking News

12/02/2019

25 శాతం పెరిగిన అబ్కారీ ఆదాయం

హైద్రాబాద్, ఫిబ్రవరి 12, (way2newstv.in)
రాష్ట్రంలో మద్యం అమ్మకాలు భారీగా పెరుగుతుండటం తో రాష్ట్ర ఖజానాకు కాసులు వర్షం కురుస్తోంది.ఒక్క మద్యం విక్రయాలను నిర్వహించే ఆబ్కారీ శాఖ ద్వారా వేలకోట్ల రూపాయలు ఆదాయం వస్తోంది.ఈ ఆర్ధిక సంవత్సరం ముగిసే నాటికి సుమారు 20 వేల కోట్లకు దాటే అవకాశం ఉందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. రాష్ట్రంలో మద్యం అమ్మకాలు పెరుగుతుండటంతో రాష్ట్ర ఖజానాకు భారీగా ఆదాయం వస్తోంది.ప్రస్తుతం రాష్ట్రంలో 2216 వైన్ దుకాణాలు,900 బార్లు,తో పాటు పర్మిట్ రూంలకు అనుమతి ఉంది.వీటితో పాటు అధికారులు ఎంత కట్టడి చేస్తున్నా గ్రామీణ ప్రాంతాలలో బెల్ట్ దుకాణాలు ద్వారా విక్రయాలు జరుగుతూనే ఉన్నాయి.


25 శాతం పెరిగిన అబ్కారీ ఆదాయం

రాష్ట్ర శాసన సభకు ఎన్నికలు జరిగిన సమయంలో ఇతర రాష్ట్రాల నుంచి మద్యం రాకుండా కట్టు దిట్టమైన ఏర్పాట్లు చేసినా పక్క రాష్ట్రాలనుంచి కూడా సరఫరా అయిందని,అయితే అధికారులు తీసుకున్నా కఠిన చర్యలు కూడా ఆదాయానికి గండిపడకుండా చేసిందని తెలుస్తోంది.ప్రతినెలావినియోగం పెరుగుతుండటంతో మద్యం తయారీ కంపెనీలు తమ ఉత్పత్తిని పెంచుకుంటున్నాయి.వచ్చే ఎక్సయిజ్ సంవత్సరంలో రాష్ట్రంలో బార్లు, వైన్ షాప్ ల సంఖ్యా కూడా పెరిగే అవకాశం ఉందని ఓక ఉన్నతాధి కారి అభిప్రాయపడ్డారు.గత సంవత్సరం తో పోల్చుకుంటే సుమారు 25శాతం అమ్మకాలు పెరిగాయని,రాష్ట్రంలో వరసగా రెండు ఎన్నికలు రావటం,మద్యం అమ్మకాల వేళలు పెంచటం కూడా అమ్మకాల పెరుగుదలకు కారణమని అధికారులు పేర్కొంటున్నారు.రాష్ట్ర వ్యాప్తంగా 10 మంది డెప్యూటీ ఎక్సయిజ్ కమిషనర్ల పర్య వేక్షణలో ప్రభుత్వం మద్యం అమ్మకాలను పర్యవేక్షిస్తోంది.రాష్ట్రంలో గల మద్యం తయారీకి కంపెనీల నుంచి తయారయ్యే మద్యం తో పాటు ఇతర రాష్ట్రాలలో ఉత్పత్తి అయ్యే బ్రాన్ద్ లతో పాటు విదేశీ మద్యం కూడా రాష్ట్రంలో ని మద్యం దుకాణాలలో అందుబాటులో ఉంటోంది.సంవత్సరం తో పోల్చుకుంటే సెప్టెంబర్ నెలలో 18శాతం,అక్టోబర్ లో 22శాతం,నవంబర్లో 23శాతం,డిసెంబర్లో 29 శాతం,జనవరిలో 32 శాతం అమ్మకాలు పెరిగాయని తెలిసింది.రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మద్యం దుకాణాలకు మద్యాన్ని సరఫరా చెయ్యటానికి 18 డిపోలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వీటితోపాటు 34 యూనిట్లను కూడా ఏర్పాటు చేసి దుకాణదారులకు ఏవిధమైన ఇబ్బంది లేకుండా సరపహారా చేస్తోంది.వివిధ బ్రాండ్ లకు చెందిన తయారీకి కంపెనీలు,బీరు తయారీ కంపెనీలు రంగారెడ్డి,మెదక్, ఆదిలాబాద్ తదితర జిల్లాలోమద్యం తయారీ కంపెనీలు ఉన్నాయి. విటోతో పాటు ఇతర రాష్ట్రాలలో తయారు అవుతున్న మద్యం, వివిధ కంపెనీలకు చెందిన విదేశీ మద్యం అందుమాటలో ఉంటోంది.వారాంతపు రోజులలో బార్ల సమయాలను పెంచటం,రాత్రి పదకొండు గంటలవరకు మద్యం దుకాణాలు  ఉంచటం కూడా ఆదాయం పెరగటానికి కారణమని తెలుస్తోంది. 

No comments:

Post a Comment