Breaking News

09/02/2019

10న చంద్రోదయం

హైద్రాబాద్, ఫిబ్రవరి 9 (way2newstv.in
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి జీవిత కథ ఆధారంగా రూపొందించిన ‘చంద్రోదయం’ సినిమా విడుదలకు సిద్ధమైంది. మార్చి 10న చిత్రాన్ని రాష్ట్రవ్యాప్తంగా విడుదల చేయనున్నట్టు నిర్మాత జీవీకే రాజేంద్ర తెలిపారు. శుక్రవారం విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో మాట్లాడుతూ ఆయనీ విషయాన్ని ప్రకటించారు. 


10న చంద్రోదయం

మోహన్‌ శ్రీజ సినిమాస్‌ శ్వేతార్క గణపతి ఎంటర్‌ప్రైజస్‌ పతాకంపై చిత్రాన్ని నిర్మించినట్టు రాజేంద్ర తెలిపారు. చంద్రబాబు జీవితం, రాజకీయ ఇతివృత్తంతో రూపొందించిన ఈ సినిమా షూటింగ్‌ను ఆగస్టు 2016లో ప్రారంభించినట్టు పేర్కొన్నారు. ఈ సినిమాకు కథ, మాటలు అందించిన పసుపులేటి వెంకటరమణే దర్శకత్వం కూడా వహించినట్టు తెలిపారు

No comments:

Post a Comment