Breaking News

09/02/2019

పత్తి రైతుల అందోళన

పెద్దపల్లి,ఫిబ్రవరి 8 (way2newstv.in)
పత్తి కి మద్దతు ఇవ్వాలని  పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ ముందు  రాజీవ్ రహదారిపై రైతుల రాస్తారోకో నిర్వహించారు. దీంతో ఇరు వైపుల ట్రాఫిక్ స్తంభించింది. పత్తి రైతులకు కేంద్ర ప్రభుత్వం రెండు సంవత్సరాల క్రితం ప్రవేశ పెట్టిన ఈ నామ్ విధానం రైతులకు ప్రయోజనం కలిగించడం లేదన్నారు.ఇప్పటి వరకు ఆయా మార్కెట్లో ఆన్ లైన్ సౌకర్యం కల్పించక పోవడంతో ఎక్కడి వ్యాపారులు అక్కడే పత్తి ని కొనుగోలు చేస్తున్నారని, మార్కెట్ కు పత్తిని తీసుకు వచ్చే రైతులకు మద్దతు ధర ప్రకనించ కుండ దళారులు ఇష్టం వచ్చినట్లు రేట్లు పెట్టుతూ రైతులను మోసం చేస్తున్నారని ఆరోపించారు.. 


 పత్తి రైతుల అందోళన

కేంద్ర ప్రభుత్వం ఖ్వింటాలుకు రూ 5450  మద్దతు ధర నిర్ణయించింది. కానీ దళారులు మాత్రం 4000 వేల నుండి రూ 4500  కు మాత్రమే కొంటున్నారని ఆరోపించారు. వెంటనే సీసీఐ అధికారులు పత్తి కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ బైఠాయించారు. దాంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి రైతులు ఆందోళన చేయకుండా వారితో మాట్లాడి వారికి అధికారులతో మాట్లాడి మద్దతు ధర కల్పిస్తామని హామీ ఇచ్చారు. 

No comments:

Post a Comment