Breaking News

09/01/2019

నిరుద్యోగ భృతికి ఆమోదం

విజయవాడ   (way2newstv.in)
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో ఏర్పాటైన ఏపీ మంత్రివర్గ సమావేశం ముగిసింది. నాలుగు గంటల పాటు నిర్వహించిన ఈ సమావేశంలో కీలక నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. నిరుద్యోగ విధివిధానాలకు ఆమోదం తెలిపి ఈ పథకానికి ముఖ్యమంత్రి యువనేస్తం పేరు నిర్ణయించారు. రాష్ట్రంలో 20వేల ఉద్యోగాల ఖాళీలు, 9,000 టీచర్ల పోస్టులతో పాటు ఇతరత్రా శాఖల్లో ఉన్న ఖాళీలు భర్తీచేయాలని తీర్మానించారువుడాకు విశాఖ మెడ్‌టెక్‌ జోన్‌ చెల్లించే రూ.11 కోట్ల పన్ను మినహాయింపునకు ఏపీ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 



నిరుద్యోగ భృతికి  ఆమోదం

వుడాను విశాఖ మెట్రో రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీగా పేరు మార్చారు. ప్రస్తుతం ఉన్న వుడా పరిధి 5,573 చదరపు కిలోమీటర్లను 6,764.59 చ.కి.మీ. మేరకు పెంచారు. వీఎంఆర్‌డీ పరిధిలోకి 48 మండలాలు, 1,346 గ్రామాలు రానున్నాయి. ఫిజియో థెరపిస్టుల రాష్ట్ర కౌన్సిల్‌ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కుప్పంలో ఎయిర్‌స్ట్రిప్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. నూతన చేనేత విధానాన్ని ఆమోదించింది

No comments:

Post a Comment