లండన్, ఆగస్టు 23, (way2newstv.in)
ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్‌లో 203 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది టీమిండియా. చివరి రోజు 2.5 ఓవర్లు ఆడిన ఇంగ్లండ్ 317 పరుగుల దగ్గర చివరి వికెట్ కోల్పోయింది. 9 వికెట్లకు 311 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లండ్.. మరో ఆరు పరుగులు మాత్రమే జోడించగలిగింది. 11 పరుగులు చేసిన ఆండర్సన్.. అశ్విన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఈ విజయంతో ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో ఇంగ్లండ్ ఆధిక్యాన్ని 2-1కి తగ్గించింది కోహ్లి సేన. రెండో ఇన్నింగ్స్‌లో బుమ్రా 5, ఇషాంత్ 2, షమి, అశ్విన్, పాండ్యా తలా ఒక వికెట్ తీసుకున్నారు. బట్లర్ (106) సెంచరీ, స్టోక్స్ (62) హాఫ్ సెంచరీ చేసినా.. ఇంగ్లండ్‌ను గట్టెక్కించలేకపోయారు.టీమిండియా పేస్‌బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రాకు నోబాల్స్‌లో వికెట్ తీయడం ఓ అలవాటుగా మారిపోయింది. ఎంత అద్భుతంగా బౌలింగ్ చేసినా ఈ నోబాల్స్ అతని కెరీర్‌కు మాయని మచ్చలాగా ఉండిపోతున్నాయి.
మూడో టెస్ట్ లో ఇండియ ఘన విజయం
ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లోనూ బట్లర్, స్టోక్స్ ఇంగ్లండ్‌ను గట్టెక్కించాలా కనిపించిన సమయంలో బుమ్రా వరుసగా నాలుగు వికెట్లతో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. అయితే తొలిసారి తన ఐదో వికెట్ తీసినా.. అది నోబాల్ కావడంతో ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ రషీద్ ఊపిరి పీల్చుకున్నాడు. బుమ్రా బౌలింగ్‌లో రషీద్ స్లిప్‌లో ఉన్న కోహ్లికి క్యాచ్ ఇచ్చినా.. అది నోబాల్ అని రీప్లేల్లో తేలింది. ఆ వెంటనే బ్రాడ్‌ను వెనక్కి పంపించి బుమ్రా ఐదో వికెట్ తీసుకున్నా.. అభిమానులు మాత్రం ఆ నోబాల్ వికెట్‌పై అతన్ని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు విరాట్ కోహ్లికి దక్కింది. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లి కీలక ఇన్నింగ్స్‌లకు, రహానే, పుజారాలు తోడవ్వడంతో ఇంగ్లండ్‌కు 521 పరుగుల భారీ లక్ష్యం నమోదైన విషయం తెలిసిందే. ఇక బౌలింగ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో ఆల్‌రౌండర్ పాండ్యా, రెండో ఇన్నింగ్స్‌లో బుమ్రా 5 వికెట్లతో చేలరేగడంతో భారత విజయం సులువైంది. రెండో టెస్టులో సమిష్టిగా విఫలమై మూల్యం చెల్లించుకున్న భారత్ ఈ మ్యాచ్‌లో సమిష్టి ప్రదర్శనతోనే విజయాన్ని నమోదు చేసింది. దీంతో 5 టెస్టుల సిరీస్‌లో 2-1తో ఇంగ్లండ్ ఆధిక్యంలో ఉంది. భారత విజయంలో కీలక పాత్ర పోషించిన కెప్టెన్ విరాట్ కోహ్లి(97, 103)కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వరించిందిసిరీస్‌లో నాలుగో టెస్ట్ ఈ నెల 30 నుంచి ప్రారంభం కానుంది.
No comments:
Post a Comment