ముంబాయి, ఆగస్టు 27, (way2newstv.in)
బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీలో అమరావతి బాండ్లు లిస్ట్ కావడం చాలా సంతోషంగా ఉందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. సోమవారం నాడు బీఎస్ఈలోని ఇంటర్నేషనల్ కన్వెన్షన్ హాలులో అమరావతి బాండ్ల లిస్టింగ్ కార్యక్రమాన్ని అయన ప్రారంభించారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి సంప్రదాయ గంటను మోగించారు. తరువాత అయన మాట్లాడుతూ గతంలో గంట వ్యవధిలో రూ.2వేల కోట్లు ఆర్జించామన్నారు. ఇంతకుముందు నగరాలను అనుసంధానం చేసేందుకు విమాన సర్వీసులు ఉన్నాయని, విమాన సర్వీసులు ఉన్నా ఎగిరేందుకు అనుమతులు వచ్చేవి కాదన్నారు. తాను జోక్యం చేసుకుని వివిధ నివేదికలు ఇచ్చానని, కేంద్రానికి ఆ తర్వాత ఓపెన్ స్కై పాలసీ వచ్చిందన్నారు.
బీఎస్ఈలో అమరావతి బాండ్లు
ప్రారంభించిన సీఎం చంద్రబాబు
ఒక ప్రాజెక్టును విజయవంతం చేసేందుకు ఒక లక్ష్యం, విజన్ కావాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు.. గ్రీన్ ఫీల్డ్ రాజధాని నిర్మించాలని నిర్ణయం తీసుకున్నానన్నారు. రాష్ట్ర విభజన తర్వాత అద్భుతమైన నగరం, భూమి లేదన్నారు. రైతులను ఒప్పించి 35వేల ఎకరాలు సమీకరించామని వెల్లడించారు. సింగపూర్ నుంచి బృహత్తర ప్రణాళిక రూపకల్పన చేయించి నిర్మాణంలో పెట్టాం. మాపై విశ్వసనీయతతో రూపాయి తీసుకోకుండా సింగపూర్ బృహత్తర ప్రణాళిక ఇచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు యనమల రామకృష్ణుడు, నారాయణ, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు, సీఆర్డీయే అధికారులు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment