హైద్రాబాద్, ఆగస్టు 22, (way2newstv.in)
ఈ యుద్ధం ఎవరిది అంటూ ‘సైరా నరసింహారెడ్డి’ టీజర్‌లో ఉగ్రరూపం దాల్చారు మెగాస్టార్ చిరంజీవి. ఖైదీ నెం. 150 మూవీతో రీఎంట్రీ ఇచ్చి బాక్సాఫీస్ దుమ్ముదులిపిన చిరు.. మరోసారి బాక్సాఫీస్ వద్ద తడాఖా చూపించేందుకు ‘సైరా’ టీజర్‌తో వచ్చేశారు. మెగాస్టార్ చిరంజీవి లీడ్ రోల్‌లో ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతోన్న ‘సైరా నరసింహారెడ్డి’ టీజర్‌ను చిరు బర్త్ డే సందర్భంగా నేడు విడుదల చేశారు. ‘సైరా’ నరసింహారెడ్డిగా బ్రిటీష్ సైన్యంపై దండెత్తే సన్నివేశాలతో ప్రేక్షకుల రోమాలు నిక్కబొడుచుకునేలా ఈ టీజర్ ఉంది. గుర్రంపై కత్తి చేతబట్టి పోరాట యోధుడిగా బిటీష్ వారిని గడగడలాడిస్తూ.. ఉగ్రరూపం దాల్చాడు మెగాస్టార్. ముఖ్యంగా చెట్ల పొదల్లోనుండి ‘సైరా’ దూసుకొస్తున్న సన్నివేశం ఔరా అనిపించేదిగా ఉంది.
దుమ్ము రేపుతున్న సైరా టీజర్
బ్రిటీష్ కాలం నాటి పరిస్థితులు, సైన్యం, భారీ కోటలు అప్పటి పరిస్థితుల్ని గుర్తు చేస్తున్నాయి. భారీ నిర్మాణ విలువలు, రత్నవేలు కెమెరా పనితనం, అమిత్ త్రివేది బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అద్భుతంగా ఉన్నాయి. ముఖ్యంగా మెగాస్టార్ చింత నిప్పుల్లాంటి కళ్లతో బ్రిటీష్ సైన్యాన్ని ఊచకోత కోస్తున్న సన్నివేశాలు దేశభక్తిని తట్టిలేపేవిగా ఉండటంతో ‘సైరా’ చిత్రానికి తిరుగేలేదన్న అభిప్రాయం వచ్చేసింది సినీ ప్రేక్షకుల్లో. ఇక ఈరోజు ఉదయం విడదలైన ‘సైరా’ టీజర్‌పై ప్రశంసలు జల్లు కురుస్తోంది. మెగా అభిమానులతో పాటు సెలబ్రిటీలు సైతం ‘సైరా’ టీజర్‌ను సాహో అంటూ ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్, నేచురల్ స్టార్ నాని, మెగా హీరో వరుణ్ తేజ్, మెహర్ రమేష్, సంపత్ నంది, అనిల్ రావిపూడితోపాటు మరికొందరు కూడా ఈ టీజర్‌పై ప్రశంసలు కురిపించారు.
No comments:
Post a Comment