నెల్లూరు, ఆగస్టు 22, (way2newstv.in)
నెల్లూరు ఆదిత్యనగర్ కార్యాలయంలో సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఇతర నేతలు పాల్గోన్నరు. భేటీలో నియోజకవర్గంలో చేపట్టాల్సిన అభివృద్ధిపై విస్తృతచర్చ జరిగింది. మంత్రి సోమిరెడ్డి మాట్లాడుతూ సర్వేపల్లి నియోజకవర్గ అభివృద్ధికి 14వ ఆర్థిక సంఘం నిధులు రూ.6 కోట్లు మంజూరయ్యాయి.అన్ని పంచాయతీల్లో కలిపి సుమారు రూ.5 కోట్ల వరకు నిధులు అందుబాటులో ఉన్నాయని అన్నారు. ప్రత్యేక అభివృద్ధి నిధులు రూ.4 కోట్లు, వాటికి మ్యాచింగ్ గ్రాంట్ గా ఎన్ఆర్జీఎస్ నిధులు మరో రూ.4 కోట్లు మంజూరవుతున్నాయి. ఈ నిధులతో అన్ని గ్రామాల్లో సిమెంట్ రోడ్లు తదితర మౌలిక వసతులు కల్పిస్తాం. గతంలో ప్రతిపక్ష సర్పంచ్ లు సహకరించక పలు గ్రామాల్లో నిలిచిపోయిన పనులను పూర్తి చేస్తాం. 50 శ్మశానాల అభివృద్ధికి రూ.10 లక్షల వంతున నిధులు మంజూరు చేయబోతున్నామన్నారు. అవసరమైన చోట బస్ షెల్టర్లు నిర్మించడంతో పాటు మినరల్ వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేయబోతున్నాం. సర్వేపల్లి నియోజకవర్గ సమగ్ర అభివృద్ధే నా లక్ష్యమని మంత్రి అన్నారు.
సర్వేపల్లి అభివృద్దికి ఆరు కోట్లు
No comments:
Post a Comment