Breaking News

18/08/2018

కేరళలో వరదల విలయం

తిరువనంతపురం, ఆగస్టు 18, (way2newstv.in)
ప్ర‌కృతికి మనం ఏదిస్తామో.. ప్ర‌కృతి మనకు అదే ఇస్తుంది....కేరళ వరదల ద్వారా నదులు ఈ విషయాన్ని మనిషికి మరోసారి అర్థం అయ్యేలా చేస్తున్నాయి. ప్రత్యేకించి మనం భూమికి భారంగా ఇస్తున్న ప్లాస్టిక్ వ్యర్థాలు ఎక్కడకూ వెళ్లవూ.. అవి తిరిగి మన వద్దకే వస్తాయి.. అనే తత్వాన్ని బోధపడేలా చేసే దృశ్యాలు కనిపిస్తున్నాయి కేరళ వరదల విళయంలో. దక్షిణాదిన టూరిస్టులకు ప్రధాన ఆకర్షణ కేరళ... గాడ్స్ ఓన్ కంట్రీగా పేరు పొందిన ఈ కేరళను చూడటానికి ఎక్కడెక్కడి నుంచినో వెళ్తూ ఉంటారు. అక్కడ రమణీయ దృశ్యాలను చూసి వాటిని జ్ఞాప‌కాలుగా మలుచుకుని వస్తున్న మనుషులు ఇదే సమయంలో అక్కడ కొన్ని ప్లాస్టిక్ వ్యర్థాలను తమ గుర్తులుగా పడేసి వస్తున్నారు. వాటర్ బాటిల్స్, కూల్ డ్రింక్ బాటిల్స్.. ఏవైతేనేం.. ఏ టూరిస్టు అట్రాక్షన్ ప్లేస్‌కు వెళ్లినా ఈ వ్యర్థాలు పేరుకు పోయి కనిపిస్తాయి. ఇవి తాత్కాలికంగా ఆయా ప్రాంతాల్లో కనుమరుగు అవుతాయేమో కానీ, శాశ్వాతంగా అయితే కాదు. తాజాగా కేరళ వరద బీభత్సంలో నదులు పొంగి పొర్లడంతో ప్లాస్టిక్ వ్యర్థాలన్నీ పొంగి పొర్లాయి. ఈ వ్యర్థాలన్నీ ఒడ్డుకు కొట్టుకు రావడం కొన్ని చోట్ల జరిగితే.. నీలాంబర్ హ్యాంగింగ్ బ్రిడ్జి వద్ద మరో రకరమైన సన్నివేశం కనిపించింది. నీళ్లు పై వరకూ రావడంతో.. ప్లాస్టిక్ వ్యర్థాలన్నీ తేలాయి. వాటిల్లో కొన్ని ఈ హ్యాంగింగ్ బ్రిడ్జికి అతుక్కుపోయాయి. అందుకు సంబంధించిన ఈ ఫొటో మనిషికి పెద్ద పాఠంలానే ఉంది. 



కేరళలో వరదల విలయం

No comments:

Post a Comment