Breaking News

18/08/2018

కాపు రిజర్వేషన్ల పై క్లారిఫికేషన్ కోరిన కేంద్రం

విజయవాడ, ఆగస్టు 18, (way2newstv.in)
కాపు రిజర్వేషన్ల పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వం, నిర్ణయం తీసుకుని, 5 శాతం రిజర్వేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే... జస్టిస్ మంజునాథన్ కమిషన్ సూచనలు ప్రకారం, నిర్ణయం తీసుకుంటూ, డిసెంబర్ నెలలో ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ ఈ నిర్ణయం తీసుకుంది... వెంటనే, బిల్లు రూపంలో, అసెంబ్లీలో కూడా పెట్టింది... ఈ బిల్లు అసెంబ్లీలో కూడా ఆమోదం పొంది, కేంద్రానికి వెళ్ళింది... అంతకంటే ముందు, ఈ బిల్లు గవర్నర్ వద్ద కూడా ఆమోదం పొందింది... ఇప్పుడు కేంద్రం పరిధిలో ఈ బిల్లు ఉంది... కేంద్ర హోంశాఖ వద్దకు ఈ బిల్లు చేరింది... అయితే తాజాగా, కాపు రిజర్వేషన్ల విషయమై కేంద్రం అడిగిన రెండు ప్రశ్నలకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇచ్చింది.కేంద్రం అడిగిన ఆ రెండు ప్రశ్నలు...వాటికి రాష్ట్ర ప్రభుత్వం సమాధానాలు ఇవి...మొదటి ప్రశ్నగా..."సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఏ రాష్ట్రంలోనైనా 50 శాతం మించి రిజర్వేషన్లు ఉండకూడదు. ఆంధ్రప్రదేశ్‌ అంతకుమించి రిజర్వేషన్లు ఎందుకు పెంచాల్సి వచ్చింది?" ...అని అడుగగా...ఈ ప్రశ్నకు సమాధానంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారులు ఈ వివరణ ఇచ్చారు... జస్టిస్‌ మంజునాథ కమిషన్‌ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలోని గణాంకాలు, కాపు, బలిజ, ఒంటరి, తెలగ కులాల్లో దారిద్య్రరేఖకు దిగువనున్న వారి వివరాలను ఏపీ ప్రభుత్వ అధికారులు సమర్పించారు. పైన పేర్కొన్న నాలుగు కులాలకు రిజర్వేషన్లు కల్పించినప్పుడే మిగతా కులాలతో వారు పోటీ పడగలరని అందులో వివరించారు. అందుకే రిజర్వేషన్లు 50 శాతం మించుతాయని తెలిపారు.ఇక రెండవ ప్రశ్నగా..."ఏపీలో కాపు రిజర్వేషన్ల అంశాన్ని జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఓబీసీ కమిషన్‌కు సిఫార్సు చేస్తాం. వారి సూచనల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటాం"...అని కేంద్రం పేర్కొనగా...అందుకు ఏపీ ప్రభుత్వం బదులిస్తూ..."కాపు రిజర్వేషన్ల అంశాన్ని ప్రత్యేకంగా చూడాలి...దీన్ని ఓబీసీ కమిషన్‌కు సిఫార్సు చేయాల్సిన అవసరం లేదు"...అని అభిప్రాయపడింది. మొత్తానికి ఈ బిల్లు పై కేంద్రంలో కదలిక రావటంతో, ఇది ఏమి అవుతుందా అనే ఆశక్తి నెలకొంది. ఏ అడ్డంకి లేకుండా ముందుకు వెళ్తుందా, లేక పొతే, ఎక్కడైనా ఫిట్టింగ్ పెడతారా అనేది చూడాల్సి ఉంది.




కాపు రిజర్వేషన్ల పై క్లారిఫికేషన్ కోరిన కేంద్రం

No comments:

Post a Comment