Breaking News

15/08/2018

అమలులోకి ఆయుష్మాన్ భారత్

న్యూఢిల్లీ, ఆగస్టు 15 (way2newstv.in)
స్వాతంత్ర దినోత్సవం పురష్కరించుకుని ఆయుష్మాన్ భారత్ అనే కొత్త స్కీమ్ ను కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొస్తుందని  బీజెపీ అధికార ప్రతినిధి చంద్రశేఖర్ తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్యస్కీమ్ ఇదని ఆయన అన్నారు. దేశవ్యాప్తంగా దాదాపు 10 కోట్ల మందికి ఇది ఉపయోగపడుతుందని, ఆంధ్రప్రదేశ్ లో కోటి నలభై లక్షల మంది దీనికి  అర్హులని చంద్రశేఖర్ అన్నారు. దీనికి ఆధార్ కార్డు, ఏదైనా బ్యాంక్ అకౌంట్, సోషల్ ఎకనామిక్ క్యాస్టు సర్టిఫికెట్ లో ఏదైనా ఒకటి ఉంటే సరిపోతుందన్నారు. ఈ స్కీమ్ లో ఎన్ రోల్ చేయించుకుంటే సంవత్సరానికి ఒక్కొక్క కుటుంబానికి ఐదు లక్షల వరకు కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుందని ఆయన తెలిపారు.  దీనిని అందరూ మోదీ కేర్ అంటున్నారని చంద్రశేఖర్ అన్నారు.



అమలులోకి ఆయుష్మాన్ భారత్ 

No comments:

Post a Comment