న్యూఢిల్లీ జూలై 21 (way2newstv.in)
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని హామీలు నెరవేరడం లేదని టీఆర్‌ఎస్ ఎంపీ వినోద్ తెలిపారు. శుక్రవారం లోక్‌సభలో కేంద్రంపై టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చలో భాగంగా వినోద్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజాకాంక్షలను ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం నెరవేర్చలేదన్నారు. మోదీ ప్రభుత్వంపై ప్రజలు పెట్టుకున్న ఆశలు ఈ నాలుగేళ్లలో ఏ ఒక్కటి కూడా నెరవేరలేదని పేర్కొన్నారు.నరేంద్రమోదీ ప్రభుత్వం రాగానే ఖమ్మం జిల్లాలో ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలిపారని టీఆర్ఎస్ ఎంపీ వినోద్ విమర్శించారు. ఈ నేపథ్యంలో టీడీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. టీడీపీ-టీఆర్ఎస్ సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఏడు మండలాలు కలిపితేనే తాను సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తానని మోదీకి చెప్పినట్లు చంద్రబాబు పలు సందర్భాల్లో చెప్పారని ఇందుకు తెలంగాణ ప్రజలు ఎప్పటికీ బీజేపీని క్షమించరని అన్నారు. ఆ ప్రాంతంలోని సీలేరు పవర్ ప్రాజెక్టును తెలంగాణ కోల్పోయిందని వినోద్ పేర్కొన్నారు.పోలవరానికి నిధులిచ్చే విషయంలో తమకు అభ్యంతరంలేదని, కాళేశ్వరానికీ జాతీయ హోదా ఇవ్వాలని వినోద్ డిమాండ్ చేశారు.
పునర్విభజన చట్టంలోని హామీలు నెరవేరడం లేదు
టీడీపీ-టీఆర్ఎస్ సభ్యుల మధ్య వాగ్వాదం
కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించాలి
ఏపీ సీఎం ధోరణి వల్లే హైకోర్టు విభజన ఆలస్యమవుతోంది
టీఆర్‌ఎస్ ఎంపీ వినోద్
తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో కాంగ్రెస్ సహకరించడంలేదని,కోర్టుల ద్వారా ప్రాజెక్టులకు అడ్డంకులు సృష్టిస్తోందని ఆయన విమర్శించారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీ ఊసే కేంద్రం ఎత్తడంలేదని, గిరిజన యూనివర్సిటీకి స్థలం ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని వినోద్ తెలిపారు.హైకోర్టు విభజన విషయంలో ఇంతవరకు అడుగు ముందుకు పడలేదన్నారు. తెలంగాణలో ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటుకు హామీ ఇచ్చారు. కానీ నెరవేరలేదు. యూనివర్సిటీ ఏర్పాటుకు కావాల్సినంత భూమి ఉంది. కానీ కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని వినోద్ అన్నారు. నేషనల్ థర్మల్ పవర్ ప్రాజెక్టు, నేషనల్ హైవేస్ సంబంధించిన పనులు పాక్షికంగానే జరిగాయన్నారు. పునర్విభజన చట్టం కింద ఇచ్చిన హామీలు ఇంకా నెరవేరలేదని ఎంపీ వినోద్ తెలిపారు. బయ్యారం ఉక్కు కర్మాగారానికి హామీ ఇచ్చారు. ఇప్పటి దాకా ఏమీ జరగలేదని వినోద్ చెప్పారు. ఏపీ సీఎం ధోరణి వల్లే హైకోర్టు విభజన ఆలస్యమవుతోందని, చంద్రబాబు కావాలనే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నిర్మించుకోవడం లేదని ఆరోపించారు. హైకోర్టు భవనం తెలంగాణలోనే ఉన్న తెలంగాణ ప్రాంతానికి చెందిన న్యాయవాదులు తక్కువగా ఉన్నారని తెలిపారు. హైకోర్టు విభజనకు ఇప్పటికే పలుమార్లు కేంద్రప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ ఆ హామీ అమలు కావడం లేదన్నారు. హైకోర్టు విభజనకు చర్యలు తీసుకోవాలని వినోద్ కోరారు. మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుని గోదావరిపై కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తున్నామని చెప్పారు. ఈ ప్రాజెక్టును ఆపేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు కోర్టుల్లో కేసులు వేస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణలోని ఒక సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించాలి. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించాలని వినోద్ డిమాండ్ చేశారు. దక్కన్ పీఠభూమిలో ఉన్న తెలంగాణకు నీళ్లు ఇచ్చేందుకు భారీ ఖర్చుతో ప్రాజెక్టులు ఏర్పాటు చేసుకుంటున్నామని తెలిపారు. కృష్ణా, గోదావరి నదులపై నిర్మించే ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలని ప్రధానిని డిమాండ్ చేశారు. ఇవాళ గగ్గోలు పెడుతున్న కాంగ్రెస్ పార్టీ నిధులు ఇచ్చే ఆలోచన చేయలేదని మండిపడ్డారు. పోలవరం కోసం నిధులు కావాలని గల్లా జయదేవ్ కోరారు. వారు అడిగిన నిధులు ఇవ్వడానికి మాకు అభ్యంతరం లేదు. పోలవరం విషయంలో తాము అడుగుతున్నది నీటి పంపకం గురించి మాత్రమే అని వినోద్ పేర్కొన్నారు. పోలవరానికి తాము అభ్యంతరం చెప్పలేదని వినోద్ స్పష్టం చేశారు. తెలంగాణ ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇచ్చి పోలవరం లాగే నిధులు ఇవ్వాలని ప్రధానని కోరుతున్నామని తెలిపారు.మోదీ ప్రభుత్వం అన్యాయంగా తెలంగాణలోని ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేసింది. ఏడు మండలాలను ఆంధ్రాలో కలపకపోతే ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయబోనని చంద్రబాబు చెప్పాడు. ప్రధాని మోదీ స్వయంగా చొరవ తీసుకుని.. ఆ ఏడు మండలాలను ఏపీలో కలిపారు. ఏపీలో విలీనం చేసిన 7 మండలాలను తిరిగి తెలంగాణకు ఇవ్వాలి. ఈ ఏడు మండలాలను తిరిగి తెలంగాణకు ఇచ్చేందుకు సభలో బిల్లు పెట్టాలని ఎంపీ వినోద్ డిమాండ్ చేశారు. నాలుగేళ్లలో తెలంగాణలో జాతీయ రహదారులు రెట్టింపయ్యాయని, కేంద్ర సహకారమే ఇందుకు కారణమని ఎంపీ వినోద్ అన్నారు. మిషన్‌కాకతీయతో 46వేల చెరువులను పునరుద్ధరిస్తున్నామని వినోద్ చెప్పారు. మిషన్ కాకతీయకు నీతి అయోగ్ రూ.5 వేల కోట్లు ఇవ్వాలన్నా.. ఆర్థికశాఖ మోకాలడ్డిందని వినోద్ విమర్శించారు. రూ.40వేల కోట్లతో మిషన్ భగీరథ చేపట్టామని, త్వరలో ఇంటింటికీ మంచినీరు ఇవ్వబోతున్నామని ఎంపీ వినోద్ పేర్కొన్నారు.
No comments:
Post a Comment