Breaking News

21/07/2018

చంద్రబాబు పై పవన్ ధ్వజం

హైద్రాబాద్, జూలై  21 (way2newstv.in)
లోక్‌సభలో అవిశ్వాసంపై చర్చ సందర్భంగా తెలుగుదేశం పార్టీ వ్యర్థ ప్రసంగాలు చేసిందని ధ్వజమెత్తారు జనసేన అధిపతి పవన్ కల్యాణ్. లోక్‌సభలో అవిశ్వాసంపై చర్చ పై పవన్ కల్యాణ్ ట్విటర్ ద్వారా స్పందిస్తూ ఉన్నారు. ఇందులో భాగంగా పవన్ కల్యాణ్ ఒక ఘాటు ట్వీట్ పెట్టారు. వ్యక్తిగత లభాల కోసం తెలుగుదేశం పార్టీ ప్రత్యేక హోదాకు మూడున్నర సంవత్సరాల పాటు తూట్లు పొడిచిందని పవన్ పేర్కొన్నారు. అలాంటి పార్టీ నేతలు ఇప్పుడు వ్యర్థ ప్రసంగాలు చేసి లాభం ఏమిటి? అని పవన్ ప్రశ్నించారు. దశాబ్దాల అనుభవం ఉన్న నాయకులకు కేంద్రం వంచన తెలియడానికి ఇన్నేళ్లు పట్టిందంటే మేము నమ్మాలా? అని పవన్ పరోక్షంగా చంద్రబాబుపై ధ్వజమెత్తారు. చంద్రబాబు పై పవన్ ధ్వజం

No comments:

Post a Comment