Breaking News

21/07/2018

సర్కార్ స్కూళ్లలో డిజిటిల్ క్లాసులు

హైద్రాబాద్, జూలై 21, (way2newstv.in) 
సర్కారు స్కూళ్లులో డిజిటల్ క్లాసులు దిశలో అడుగులు వేస్తున్నాయి. ఇప్పటి వరకు ప్రైవేట్ పాఠశాలలకు పరిమితమైన డిజిటల్ విద్యను ప్రభుత్వ పాఠశాలల్లో ప్రారంభించాలని సర్కారు నిర్ణయించింది. ఇది వరకు జిల్లాలోని 10 మాడల్ స్కూల్స్‌లో అమలులో ఉన్న డిజిటల్ విద్యను.. ఈ విద్యా సంవత్సరం నుంచి జిల్లాలోని 248 ప్రభుత్వ పాఠశాలల్లో ప్రారంభించాలని నిర్ణయించింది. స్మార్ట్ క్లాస్‌లుగా పిలిచే దానిలో కంప్యూటర్ అనుసంధానంతో డిజిటల్ తరగతులను బోధించనున్నారు. ఉత్తీర్ణతలో జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్‌ను మించిపోయాయి. సుక్షితులైన ఉపాధ్యాయులకు తోడు సకల సౌకర్యాల కల్పనతో సర్కారు విద్యార్థులు మంచి ఫలితాలను సాధిస్తున్నారు. గత మార్చిలో పదో తరగతి ఫలితాల్లో ప్రైవేట్‌కు దీటుగా 140 ప్రభుత్వ పాఠశాలలు వంద శాతం ఉత్తీర్ణత సాధించాయి.



సర్కార్ స్కూళ్లలో డిజిటిల్ క్లాసులు

 40మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు 10/10 జీపీఏ సాధించారు. బాసర ట్రిఫుల్ ఐటీలో జిల్లా నుంచి 247 మంది ఎంపికైతే, అందులో 70శాతం ప్రభుత్వ విద్యార్థులు ఉన్నారు. అర్హులైన, సుక్షితులైన ఉపాధ్యాయుల పర్యవేక్షణలో విద్యార్థులు మంచి ఉత్తీర్ణత సాధిస్తున్నారు. ఇప్పుడు డిజిటల్ స్మార్ట్ క్లాసులు ప్రవేశపెట్టనుండడంతో మరిన్ని మంచి ఫలితాలు రానున్నాయి.సర్కారు ఉపాధ్యాయులు సైతం త్వరలోనే బ్లాక్ బోర్డుపై చాక్‌పీస్ లేకుండానే స్మార్ట్‌గా తరగతులను బోధించనున్నారు. జిల్లాలోని 248 పాఠశాలలకు కేయాన్స్ అనే సంస్థ ద్వారా డిజిటల్ పరికరాలను పాఠశాలలకు అందించారు. వాటిని జిల్లాలోని 248 స్కూల్స్‌కు సంబంధించిన హెడ్మాస్టర్లు, ఫిజిక్స్, మ్యాథ్స్, ఇంగ్లిష్ ఉపాధ్యాయులకు ఒకరోజు శిక్షణను ప్రారంభించారు. ఈనెల చివరి వరకు జిల్లాలోని 12 కేంద్రాల్లో శిక్షణను ఇస్తున్నారు. తొలుత పాఠశాలల్లో హైస్కూల్స్‌లో డిజిటల్ తరగతుల బోధన జరగనుంది. అక్కడ శిక్షణకు కేయాన్స్ సంస్థ నుంచి వచ్చిన ప్రతినిధితో శిక్షణ ఇప్పిస్తున్నారు. జిల్లాలో రెండు డివిజన్‌ల పరిధిలో ఉపాధ్యాయులు శిక్షణలో నిమగ్నమయ్యారు. ఆగస్టు నుంచి జిల్లాలోని అన్ని ఉన్నత పాఠశాలల్లో స్మార్ట్ క్లాస్‌ల నిర్వహణ ప్రారంభం కానుంది. ఇటీవల వేసవి కాలంలోనే జిల్లాలోని అన్ని ఉన్నత పాఠశాలల్లో విద్యుత్తు సమస్యలను పరిష్కరించారు. అన్ని పాఠశాలల్లో ఈ శిక్షణను పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులతో తరగతులు నిర్వహిస్తారు. ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పాటు చేసిన కంప్యూటర్ విద్యకు నిధులు ఇవ్వకుండా నాటి పాలకులు నిర్లక్షం చేశారు. మన టీవీ ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో తరగతులు ఇప్పుడు జరుగుతున్నప్పటికీ.. డిజిటలైజేషన్ ద్వారా మంచి విద్యకు అవకాశాలు ఉండడంతో ఈ స్మార్ట్ క్లాస్‌ల నిర్వహణకు ప్రభుత్వం నిధులు ఇచ్చింది. దాని ద్వారా తొలుత ఉన్నత పాఠశాలలను అనుకున్నప్పటికీ.. నిజామాబాద్ డివిజన్‌లో 12 ఉచ్చత్తర పాఠశాలల్లో, బోధన్ డివిజన్‌లోని 3 అప్పర్ ప్రైమరీ స్కూల్స్‌లో డిజిటల్ తరగతుల నిర్వహణకు ఏర్పాట్లు జరిగాయి.

No comments:

Post a Comment