Breaking News

21/07/2018

ఏపీపై కేంద్ర వైఖరికి నిరసనగా 24 ఏపి బంద్‌ వైకాపా అధ్యక్షుడు జగన్‌ పిలుపు

కాకినాడ జూలై 21 (way2newstv.in) 
ఏపీపై కేంద్ర వైఖరికి నిరసనగా ఈనెల 24 రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిస్తున్నట్లు వైకాపా అధ్యక్షుడు జగన్‌ ప్రకటించారు. అవిశ్వాస తీర్మానంపై నిన్న పార్లమెంటులో జరిగిన సన్నివేశాలను అంతా చూశామని.. రాష్ట్రంపై దిల్లీ పెద్దలకు ఉన్న ప్రేమ చూస్తే చాలా బాధేస్తోందని అన్నారు. శనివారం కాకినాడలో జగన్‌ మీడియాతో మాట్లాడారు. తెదేపా ఎంపీలంతా రాజీనామాలు చేసి నిరాహార దీక్షలకు కూర్చోవాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో అందరు ఎంపీలు రాజీనామాలు చేసి పోరాటం చేస్తే ప్రత్యేక హోదా ఎందుకు రాదన్నారు.నిన్న లోక్‌సభలో అవిశ్వాసంపై జరిగిన చర్చలో ప్రత్యేక హోదాపై కాంగ్రెస్‌, భాజపాలు ఏమాత్రం మాట్లాడలేదని జగన్‌ అన్నారు. 



ఏపీపై కేంద్ర వైఖరికి నిరసనగా 24 ఏపి బంద్‌
        వైకాపా అధ్యక్షుడు జగన్‌ పిలుపు

కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఏపీకి సంబంధించిన అంశాలపై అర నిమిషం కూడా మాట్లాడలేదని విమర్శించారు. హోదా ఐదేళ్లు కాదు.. పదేళ్లు అన్నవారికి నిన్న పార్లమెంట్‌లో ఆ విషయం గుర్తుకురాలేదా? అని ప్రశ్నించారు. నాలుగేళ్లైనా ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని మండిపడ్డారు.చంద్రబాబు ఆమోదంతోనే ప్యాకేజీ ఇచ్చామని ప్రధాని అన్నారని జగన్‌ గుర్తుచేశారు. హోదాకు బదులు ప్యాకేజీ చాలు అని చెప్పడానికి చంద్రబాబు ఎవరు? అని ప్రశ్నించారు. ఏపీ ప్రజల హక్కులను తాకట్టుపెట్టే అధికారం కేంద్రం, చంద్రబాబుకు ఎవరిచ్చారని నిలదీశారు. నిన్న లోక్‌సభలో ప్రత్యేకహోదాకు సంబంధించి ఎంపీ గల్లాజయదేవ్‌ మాట్లాడిన మాటలు గత నాలుగేళ్లుగా తమ పార్టీ చెబుతున్నవేనని పేర్కొన్నారు. జయదేవ్‌ మాటలు.. అసెంబ్లీలో మేం మాట్లాడిన మాటలు ఒకసారి చూడాలని కోరారు. ‘అప్పుడు మేం మాట్లాడితే నన్నుఅపహాస్యం చేశారు.. ఇవాళ అవే మాట్లాడుతున్నారు.’ అని విమర్శించారు. ప్రత్యేక హోదా వస్తేనే రాష్ట్రానికి న్యాయం జరుగుతుందని చంద్రబాబుకు తెలియదా? అని ప్రశ్నించారు.

No comments:

Post a Comment