పెద్దపల్లి, జూలై 13, (way2newstv.in)
దేశవ్యాప్తంగా మహిళ సంఘల ప్రతినిధులతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంభాషించారు. ఈ కార్యక్రమంతో మహిళల సాధిస్తున్న విజయాలతో పాటు వివిధ రాష్ట్రాలలో మహిళలు ఎదుర్కోంటున్న సమస్యల గురించి తెలుసుకున్నామని ప్రధానమంత్రి విడీయో కాన్పరెన్స్ లో పాల్గోన్న పెద్దపల్లి జిల్లా మహిళ సంఘల ప్రతినిధులు అన్నారు.
పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కాన్పరెన్స్ కార్యాలయంలో డిఆర్డిఏ ఆద్వర్యంలో ప్రధాన మంత్రి మహిళ సంఘాల ప్రతినిధులతో ముఖాముఖి వీడియో కాన్పరెన్స్ లో జిల్లాలోని వివిధ మండలలోని ఇరువైమంది మహిళ సంఘాల ప్రతినిధులు, విద్యార్థినిలు పాల్గోన్నారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల మహిళ ప్రతినిధులతో ప్రధానమంత్రి మాట్లాడుతున్న తీరును ఆసక్తిగా గమనించారు. వివిధ రాష్ట్రాలలో మహిళా సంఘాలు అబివృద్ది చెందుతున్న తీరును తెలుసుకున్నారు. వారు ఎదుర్కోంటున్న సమస్యలు తెలుసుకున్నారు.
ప్రధానితో మాట్లాడిన పెద్దపల్లి మహళలు
No comments:
Post a Comment