Breaking News

27/07/2018

ఆక్వా కు షాక్...

ఏలూరు జూలై 27, (way2newstv.in)
ఆంద్రప్రదేశ్ కి అతిముఖ్య ఆదాయవనరు చేపల, రొయ్యల ఎగుమతి, విదేశీ ఎగుమతులే కాదు, ఇతర రాష్ట్రాలకు కూడా ఎగుమతి ద్వారా వచ్చే ఆదాయం, ఆ పరిశ్రమకు అనుబంధ పరిశ్రమల ద్వారా వచ్చే ఆదాయం ఇవన్నీ రాష్ట్రానికి ఆదాయ వనరులే. అందుకే బిజెపి దారుణానికి తెగబడింది.రాష్ట్రంలో పండే చేపల్లో ఫార్మాలిన్ ఉంటుంది అనే సాకు చూపించి, బిజెపి పాలిత రాష్ట్రాలు మన రాష్ట్రం నుండి కొనుగోళ్ళు ఆపేశాయి. బిజెపి పాలిత రాష్ట్రాలకు తప్ప ఈ ఫార్మాలిన్ మరే రాష్ట్రానికి కనపడలేదు. బీహార్, వెస్ట్ బెంగాల్ లాంటి రాష్ట్రాలు ఎప్పటిలాగే కొనుగోలు చేస్తున్నాయి. అంతే కాదు మన రాష్ట్రం నుండి ఎగుమతి అవుతున్న సౌత్ ఆసియన్ కంట్రీస్, కొత్తగా కొంటున్న కొరియా , యూరోపియన్ కంట్రీస్, జపాన్.... వీటిలో ఏ దేశానికి కూడా ఈ ఫార్మాలిన్ కనపడలేదు. కేవలం బిజెపి పాలిత రాష్ట్రాలకే కనపడింది.ఇది కేవలం చంద్రబాబు మీద కోపంతో, తమ పార్టీని ఎదిరించాడని , అందుకే ఆంద్రప్రదేశ్ ని ఆర్ధికంగా దెబ్బతీయాలని చూస్తున్న కమలనాధుల నాటకం, రాజకీయ విభేదాలున్నా, సైద్దాంతిక వైరుధ్యాలున్నా ఎప్పుడు , ఏ పార్టీ ఇలా ప్రవర్తించింది లేదు. ఇంత దారుణంగా, బహిరంగంగా, నిర్లజ్జగా అధికార దుర్వినియోగం చేస్తున్న పార్టీ బిజెపినే. ఆక్వా రంగంలో నెంబర్ 1 గా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని టార్గెట్ గా బీజేపీ చేస్తున్న అన్యాయం ఇది. ఒక పక్క నిధులు ఇవ్వక, హక్కులు కూడా ఇవ్వక, రాష్ట్రాన్ని ఇబ్బంది పెడుతూ, మన సొంతగా కష్టపడి పైకి వస్తుంటే, మన కష్టం పై కూడా బీజేపీ కక్ష సాధిస్తుంది. ఇలా కూడా కక్ష సాధిస్తారా అని అధికారులు ఆశ్చర్యపోతున్నారు.



 ఆక్వా కు షాక్...

No comments:

Post a Comment