Breaking News

27/07/2018

ఇక తండాలకు కొత్త రూపులు

మహబూబ్ నగర్, జూలై 27, (way2newstv.in)
తండాలను పంచాయతీలుగా మార్చిన సర్కారు, నూతన పంచాయతీలతో పల్లెలకు కొత్త రూపును తీసుకొస్తున్నది. ఈ నెల 31న సర్పంచ్‌ల పదవీ కాలం పూర్తి కానుండటంతో కొత్త పంచాయతీలకు సైతం పర్స న్ ఇన్‌చార్జిలను నియమించి, కొత్త పాలనకు తెరలేపుతున్నది. కొత్త పంచాయతీల అభివృద్ధి కోసం జిల్లాకు రూ.కోటి నిధులను మంజూరు చేస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. పంచాయతీ ఎన్నికలు జరిగే దాకా కొత్త పంచాయతీల్లో అభివృద్ధి పనులు వేగవంతం అయ్యేందుకు ఈ నిధులను కేటాయించనున్నారు.



ఇక తండాలకు కొత్త రూపులు

 14వ ఆర్థిక సంఘం ద్వారా నిధులు కేటాయించినప్పటికీ అదనంగా కొత్త పంచాయతీలకు మరో రూ.కోటి నిధులను కేటాయించడంతో ఎన్నికల లోపు పంచాయతీల్లో అభివృద్ధి వేగవంతం కానుంది. దీంతో కొత్త పంచాయతీల్లో పరిపాలన ప్రజలకు చేరువకానుంది.జిల్లాలోని 479 గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక అధికారులతో పాలన సాగించేందుకు అధికారుల యంత్రాంగం కసరత్తు పూర్తి చేసింది. ప్రభుత్వం సైతం నిన్న మొన్నటి వరకు సర్పంచ్‌లనే కొనసాగించాలని ఆలోచన చేసినప్పటికీ, చట్టపరంగా తలెత్తిన సమస్యలను దృష్టిలో ఉంచుకొని కొత్త పంచాయతీల్లో పాత సర్పంచ్‌లను కొనసాగించే అవకాశం లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని స్పెషల్ ఆఫీసర్ల నియామకానికి శ్రీకారం చుట్టింది. జిల్లాలో ఇప్పటికే 92 మంది కార్యదర్శులు ఉండగా, 182 పంచాయతీలకు వీరు ఇన్‌చార్జిలుగా వ్యవహరిస్తున్నారు. 274 కొత్తపంచాయతీలకు కార్యదర్శుల నియామకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో త్వరలో కార్యదర్శుల నియామకం చేపట్టనున్నారు. మారుమూల ప్రాంతాల్లో గ్రామపంచాయతీలకు సుదూరంగా ఉన్న చిన్నచిన్న గ్రామాలకు, తండాలకు మోక్షం లభించింది. ఏళ్లతరబడి ఎదురు చూస్తున్న నిరీక్షణలు ఫలిస్తున్నాయి. ప్రతి పనికోసం పక్క గ్రామానికి వెళ్లి గంటల తరబడి ఎదురు చూసే అవస్థలు తప్పనున్నాయి. ప్రభుత్వం ఆదేశాలతో జిల్లాలో 274 గ్రామపంచాయతీలను కొత్త ఏర్పాటు చేస్తున్నారు. దీంతో గ్రామస్థుల్లో ఆనందం వెల్లివిరిసింది. ఆగస్టు 2 నుంచే కొతత గ్రామపంచాయతీలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామపంచాయతీల ఆవిర్భావ కార్యక్రమాన్ని పండుగలా నిర్వహించనున్నారు. చాటింపులు వేయించి గ్రామస్తులందరినీ భాగస్వామ్యం చేసేలా నూతన గ్రామపంచాయతీలను ప్రారంభించినున్నారు. నూతనంగా ఏర్పాటు చేసిన గ్రామపంచాయతీ భవనాలను సుందరంగా తీర్చిదిద్దనున్నారు. అదే రోజున గ్రామాలకు ప్రభుత్వం నియమించిన ప్రత్యేక అధికారులుకూడా బాధ్యతలు స్వీకరించనున్నారు.  గ్రామపంచాయతీలను కలిపి 182 క్లస్టర్లను పునర్విభజన చేయనున్నారు. కొత్తగా ఏర్పడిన గ్రామపంచాయతీల సంఖ్యకు అనుగుణంగా నూతన క్లస్టర్లు ఏర్పడనున్నాయి. దీంతో కొత్త గ్రామపంచాయతీల పరిధిలో మారునున్నాయి. స్పెషల్ ఆఫీసర్లుగా 176మందిని లోని ఎంపీడీఓలు, ఈఓలు, ఈఓపీఆర్డీలు, ఏఓ, తహసీల్‌దార్లను ప్రత్యేక అధికారులుగా నియమించి పాలనను కొనసాగించనున్నారు. నూతనంగా ఏర్పాటు చేస్తున్న గ్రామపంచాయతీల్లోని కార్యాలయాలకు అవసరమైన సిబ్బందిని, భవనాలను ఏర్పాటు చేస్తున్నారు. పాత పంచాయతీల్లో ఉన్న సిబ్బందిని కొత్త పంచాయతీలకు అనుగుణంగా విభజించనున్నారు. స్వీపర్లు, ఎలక్ట్రీషియన్లు, వాచ్‌మెన్లు, బిల్ కలెక్టర్లు వంటి సిబ్బందిని అవసరానికి అనుగుణంగా ఆయా గ్రామాలకు కేటాయించనున్నారు. ప్రస్తుతం గ్రామపంచాయతీల పరిధిలో కొత్తగా ఏర్పాటయ్యే వాటి పరిధి, జనాభాకు అనుగుణంగా ఆస్తుల పంపిణీ పూర్తి చేయనున్నారు. రెవెన్యూ రిజిస్టర్ల పంపిణీ అన్ని రకాల అధికార వ్యవహార పత్రాలను వేర్వేరు చేసి పంపిణీ చేయనున్నారు. గ్రామపంచాయతీలకు కేటాయించిన ప్రత్యేకాధికారులు నిర్ధేశించిన రోజున కచ్చితంగా బాధ్యతలు స్వీకరించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గ్రామపంచాయతీ పేరున కొత్త బ్యాంక్ అకౌంట్‌ను గ్రామానికి కావాల్సిన తాగునీటి సరఫరా, పారిశుధ్యం, వీధి దీపాలు, సామాజిక పింఛన్ల పంపిణీ ఇతర ప్రభుత్వ అవసరాలను తీర్చేలా ప్రత్యేక అధికారులు పని చేయనున్నారు. 182 క్లస్టర్లలో 176 మంది ప్రత్యేక అధికారులను నియమించనున్నారు.

No comments:

Post a Comment