ఏలూరు జూలై 7 (way2newstv.in)
పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులుకు నిర్మించే ఇళ్లు, కాలనీల్లో మౌళిక సదుపాయాలకు నిధులకు డోకాలేదని జిల్లా కలెక్టర్ డా.కాటంనేని భాస్కర్ చెప్పారు. స్థానిక కలెక్టర్ కార్యాలయంలో శనివారం భూసేకరణ, వివిధ ప్రాజెక్టుల ప్రగతితీరుపై కలెక్టర్ డా.భాస్కర్ సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందుకు సంబంధించిన బడ్జెట్ ప్రత్యేకించబడటంతోపాటు రు. 1350 కోట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ దృష్ట్యా నిర్మాణపనులు సరవేగంతో నిరంతరాయంగా జరగాలన్నారు. పనులు నిర్వహిస్తున్న కాంట్రాక్టర్లు తమ బిల్లు చెల్లింపులు కోసం ఎవరికీ ఎటువంటి ముడుపులుచెల్లించాల్సిన అవసరం లేదన్నారు .ఎవరైనా ఇటువంటి చర్యలకు పాల్పడితే వారిదగ్గరనుండి రూపాయకి నాలుగు రూపాయలు కక్కిస్తామని చెప్పారు.
పోలవరంనిర్వాసితుల ఇళ్ల నిర్మాణపనులపై సమీక్ష
కాంట్రాక్టర్లు ఎవరూ బిల్లుచెల్లింపులుకోసం ఎదురుచూడాల్సిన అవసరం లేదని ఎప్పటికప్పుడు పనులుబట్టి బిల్లు చెల్లింపులు జరుగుతాయన్నారు . సంబంధిత బిల్లులు సంతకం కోసం కాంట్రాక్టర్లను పదేపదే తిప్పుకునే పాతపద్దతులను ఇంజనీర్లు వధులు కోవాలన్నారు . నిర్వాసితులకు ఇళ్లనిర్మాణం కోసం కేవలం ఇంకా 8 నెలల సమయం వుందని, ఈ దృష్ట్యా కాలక్షేపం పనులు చేయకుండా పనుల్లో ప్రగతి చూపించాలన్నారు. పోలవరం ప్రాజెక్టు సివిల్ పనులు, డామ్ పూర్తయి 2019మార్చినాటికి గ్రావిటీ ద్వారా నీళ్లు ఖచ్చితంగా వెళతాయని , నెల రోజుల్లో ప్రాజెక్టు గేటులు కూడా అమర్చడం ప్రారంభమౌతుందన్నారు .ఈ దృష్ట్యా నిర్వాసితుల ఇళ్లనిర్మాణంపనులు చురుగ్గా సాగాలన్నారు. చింతలపూడి ప్రాజెక్టుకు సంబంధించి 98 డిజైన్లు పెండింగ్ లో వున్నాయని ఈవారంలో కేవలం 5 డిజైన్లు మాత్రమే ఆమోదం పొంధాయన్నారు. అయితే ఈవిషయంలో జరుగుతున్న తీవ్రజాప్యాన్ని తాను సహించబోనని, ఇకపై వారానికి 25డిజైన్లు తక్కువకాకుండా సంబంధిత కార్యాలయం నుండి ఆమోదం లభించాలన్నారు. లేనిపక్షంలో ఆకార్యాలయం ముందే ధర్నాచేసేందుకు కూడా వెనుకాడబోనన్నారు. పోణంగిపుంతకు సంబంధించి రెండు సంవత్సరాల నుండి పనులు చేస్తున్నా కాలువచివరివరకు నీళ్లు ఎందుకు వెళ్లడంలేదని సంబంధిత ఇంజనీర్ ను ప్రశ్నించారు. మొత్తం కాలువ చివరివరకు సంబంధిత ఆయకట్టుకు నీరు వెళుతున్నదీ లేనిదీ స్వయంగా పరిశీలించి సమాచారం ఇవ్వాలని ఏలూరు ఆర్ డి ఒ ను ఆదేశించారు. వచ్చే వారం నాటికి పోణంగిపుంతకాలువ ద్వారా శివారు భూములకు సైతం నీరుఅందించకపోతే సంబంధిత ఇంజనీర్లపై చర్యలు తీసుకుంటామన్నారు. పట్టణ గృహనిర్మాణ పధకంపై కలెక్టర్ సమీక్షిస్తూ లబ్దిదారులకు ఇళ్ల మంజూరు, నిర్మాణం విషయంలోఎవరైనా డబ్బులు ఆశిస్తే అటువంటి వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. చింతలపూడి తో సహా ఇతర ప్రాజెక్టుల భూసేకరణ విషయంలో చట్టప్రకారం మాత్రమే పరిహారం చెల్లించబడుతుందన్నారు. జిల్లాలో వివిధ జాతీయ రహదారుల నిర్మాణం అభివృద్దికి భూమి ఇచ్చి 7నెలలు కావస్తున్నప్పటికీ పనులు ప్రారంభించకుండా భూమి ఇవ్వలేదని రోడ్దుపని జరగడంలేదనే హాక్కు సంబంధిత అధికారులకు ఎంతమాత్రం లేదన్నారు. హైదరాబాదు నుండి కొవ్వూరు వరకు నేరుగా కొత్తగా జాతీయ రహదారి ఏర్పడుతున్న దృష్ట్యా చింతలపూడి, టి .నరసాపురం, జంగారెడ్ది గూడెం, దేవరపల్లి, కొవ్వూరు ప్రాంతాలకు ఆరహధారిని అనుసంధానం చేసేందుకు నాలుగు వరసల కనెక్టివ్ రహధారులు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఆర్ అండ్ బి ఎస్ఇ ని కలెక్టర్ ఆదేశించారు. అదేవిధంగా ఈ జాతీయ రహదారిని దృష్టిలో ఉంచుకుని కొవ్వూరు-పెరవలి, పెరవలి-నరసాపురం రహదారి అభివృద్దిపనులు శరవేగంతో ఖచ్చితంగా చేయాలని దీనివల్ల హైదరాబాదు నుండి నరసాపురం నకు 250 కి .మీ. దూరం తగ్గుతుందన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో వివిధ పబ్లిక్ హెల్త్ త్రాగునీటి పధకాల నిర్మాణపనులు, రైల్వే పనులు, గ్యాస్ పైప్ లైన్లు తదితర అంశాలపై సంబంధిత అధికారులతో కలెక్టర్ డా.భాస్కర్ సమీక్షించారు. ఈ సమావేశంలో అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ ప్రవీణ్ ఆదిత్య, భూసేకరణ ప్రత్యేక కలెక్టర్ బానుప్రసాద్, ఇన్‌చార్జి జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ, ఐటిడిఎ పిఒ హరీంద్రప్రసాద్, ఆర్ అండ్ బి ఎస్ఇ నిర్మల, డిఎఫ్ఒ నాగేశ్వరరావు, జలవనరులశాఖ ఎస్ఇ రఘునాద్, హౌసింగ్ పిడి శ్రీనివాసరావు, పిఆర్ ఎస్ఇ మాణిక్యం, ఆర్ డి ఒ లు జి .చక్రధరరావు, మోహన్ కుమార్, సత్యనారాయణరావు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment