Breaking News

30/06/2018

స్థానికులకు ఉద్యోగాలు లేవు : పవన్ కళ్యాణ్

విశాఖపట్నం, జూన్ 30, (way2newstv.in)
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శుక్రవారం నాడు విశాఖలోని రిషికొండ దగ్గర ఉన్న ఐటీ భూములని, సంస్థల గురించి అక్కడి ఐటీ సెజ్ లను పరిశీలించారు. తరువాత మాట్లాడుతూ ఐటీ కోసం భూములను  స్థానికులకి ఒక ధర విదేశాల వారికి మరొక ధర ఎలా ఇస్తారని ఆయన ప్రశ్నించారు. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ సంస్థకు 25 ఎకరాలు ఎందుకిచ్చారో ప్రభుత్వం చెప్పాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. లక్ష ఉద్యోగాలు వస్తాయని ప్రభుత్వం చెప్పిందని, కానీ రెండు మూడు వేల ఉద్యోగాలు అయినా ఇచ్చే పరిస్థితి లేదని ఆయన అన్నారు. ప్రత్యేక హోదా తేలేని ప్రభుత్వం కనీసం కాలుష్యం అరికట్టే చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. అసలు స్థానికులకు ఉద్యోగాలు లేవు  : పవన్ కళ్యాణ్ 

విశాఖలోని ఐటి సెక్టార్లో స్థానికులకు ఉద్యోగాలు లేవని అయన అన్నారు. వెనుకబాటు తనంతో ఉద్యమాలు వస్తాయని అంటే, రెచ్చగొట్టే ధోరణి అని అనడం సరికాదని ఆయన అన్నారు. .ప్రభుత్వం చెబుతున్న దానికిక్షేత్రస్థాయిలో జరుగుతున్న దానికి పొంతన లేదు. ఈ ప్రాంతం చూస్తుంటే కేప్ టౌన్ అంత అందంగా ఉంది. ప్రభుత్వాలకి అర్బనైజేషన్ మీద భవిష్యత్తు అవసరాల మీద సరిగా అవగాహన లేదు. స్థానిక వ్యక్తులకు అన్యాయం చేస్తేవేర్పాటువాద భావాలు వస్తాయి.అది మనం తెలంగాణలో చూశాం. మళ్ళీ ఇంకోసారి ఇంకోచోట జరగకూడదని అని నేను చెపుతున్నానని అన్నారు. 

No comments:

Post a Comment