Breaking News

28/06/2018

4000 ధియేటర్లలో సంజూ

ముంబై జూన్ 28 (way2newstv.in)   
బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ జీవిత కథ ఆధారంగా రూపొందిన ‘సంజూ’ సినిమా భారీ ఎత్తున విడుదల కాబోతోంది. ప్రపంచ వ్యాప్తంగా తొలి రోజున ఈసినిమా ఏకంగా 4,000 స్క్రీన్లపై ప్రదర్శితం కాబోతోందని సమాచారం. కేవలం ఒక్క భాషలో విడుదల అవుతున్న సినిమా ఇన్ని స్క్రీన్లపై విడుదల కావడం ఒక రికార్డే. రణ్‌బీర్ కపూర్ సంజయ్ దత్ గా నటించిన ఈ సినిమాను రాజ్ కుమార్ హిరాని రూపొందించారు. ఒక స్టార్ హీరో బయోపిక్ కావడం, అందునా సంజయ్ దత్ బయోపిక్ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇది వరకూ సంజయ్ దత్ తో పలు సినిమాలు రూపొందించిన దర్శకుడే రాజ్‌కుమార్ హిరాని. 



 4000 ధియేటర్లలో సంజూ

ఇక దర్శకుడిగా ఈయనకు అపజయం అంటూ లేదు. ఈ నేపథ్యంలో దత్ బయోపిక్ బాగుంటుందనే అంచనాలున్నాయి. ట్రైలర్ ఆ భరోసాను ఇస్తోంది. దీంతో భారీ స్థాయిలో ఓపెనింగ్స్ ఉన్నాయని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు. ఈ సినిమా రికార్డు స్థాయిలో తొలి రోజు వసూళ్లను నమోదు చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. జూన్ 29న అంటే..ఈ శుక్రవారం సంజూ విడుదల కాబోతోంది. తొలి రోజు వసూళ్లు భారీగా ఉంటాయని, తొలి వీకెండ్‌కు ఈ సినిమా గ్రాస్ వసూళ్లతో వంద కోట్ల రూపాయల మార్కును అందుకుంటుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ సినిమా ప్రీ రిలీజ్ మార్కెట్‌లో రెండు వందల కోట్ల రూపాయల వరకూ వ్యాపారం చేసిందని టాక్. థియేటరికల్ హాక్కులను ఈ మొత్తానికి సేల్ చేశారని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. పాజిటివ్ టాక్ వస్తే ఈ సినిమా రెండు వందల కోట్ల రూపాయల షేర్‌ను అలవోకగా వసూలు చేయగలదనే అంచనాలున్నాయి.

No comments:

Post a Comment