ఖమ్మం జనవరి07
మహిళల భద్రతకు భరోసా కల్పించేందుకు అవసరమైన చర్యలను చేపడుతున్నట్లుపోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ అన్నారు.ప్రభుత్వ హస్పటల్ అవరణలో నిర్మాణంలో వున్న భరోసా కేంద్ర నూతన భవనాన్ని పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ మంగళవారం సందర్శించారు. మహిళల భద్రతకు భరోసా కల్పించేందుకు భరోసా కేంద్రానికి అవసరమైన భవనాన్ని ఇటీవల జిల్లా కలెక్టర్ ఆర్వీ.కర్ణన్ గారు కేటాయించారు. సఖీ కేంద్రంగా వున్న భవనంలోని పై అంతస్తులో త్వరలోనే భరోసా కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు.
భరోసా కేంద్ర భవనాన్ని సందర్శించిన పోలీస్ కమిషనర్
ఈ నేపథ్యంలో పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ , అడిషనల్ డిసిపి లా&ఆర్డర్ మురళీధర్, అడిషనల్ డిసిపి ఆడ్మీన్ ఇంజరాపు పూజ గారుసందర్శించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ..గృహహింస నుంచి మొదలు లైంగికదాడుల వరకు సమాజంలో రకరకాల వేధింపులకు గురైన మహిళలు, పిల్లలను ఆదుకోవడానికి అవసరమైన పోలీస్, న్యాయ, విచారణ, కౌన్సెలింగ్, వైద్యం తదితర అన్ని రకాల సేవలు ఇక్కడ ఒకే చోట లభిస్తాయని తెలిపారు. ఒక మహిళా పోలీస్ అధికారి, సైకాలజిస్ట్, లీగల్ అడ్వైజర్, బాధితుల కేసులు నమోదు చేసుకోవడానికి, వారి స్టేట్ మెంట్స్ రికార్డు చేసుకునేందుకు సిబ్బందితో పాటు కౌన్సిలింగ్ సిబ్బంది అందుబాటులో ఉండే విధంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు కార్యక్రమంలో సిఐ రమేష్ , మహిళ పోలీస్ స్టేషన్ సిఐ అంజలి పాల్గొన్నారు.
No comments:
Post a Comment