Breaking News

07/01/2020

మందు లారీ బోల్తా.. పాదచారులు మందు సీసాలతో హల్ చల్

సింగరాయకొండ జనవరి07 (way2newstv.in)
ఒంగోలు నుండి నెల్లూరు వైపు వెళ్తున్న లిక్కర్ లారీ రోడ్డు డివైడర్ ను ఢీ కొని బోల్తా కొట్టడంతో లారీలో మందు కాస్తా రోడ్డుపాలయింది. సింగరాయకొండ వద్ద గల జివిఆర్ ఆక్వా ఎదురు హైవేపై  ముగ్గురు ప్రయాణిస్తున్న లిక్కర్ లారీ బోల్తా పడింది. 
మందు లారీ బోల్తా.. పాదచారులు మందు సీసాలతో హల్ చల్

వెంటనే అటుగా వెళ్తున్న పాదచారులు మరియు జీవిఆర్ ఉద్యోగులు కలసి లారీ క్యాబిన్ లో ఇరుక్కున్న వ్యక్తుల్ని బయటకు తీయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అలాగే పోలీసులు వచ్చేలోపు రోడ్డుపాలైన మద్యాన్ని ( ఆఫీసర్స్ ఛాయిస్ ) దొరికింది దొరికినట్లు జెబుల్లో, కవర్లలో లాగించేశారు. పోలీసుల రాకతో మద్యం సీసాలు కుప్పగా వేయించారు.

No comments:

Post a Comment