ముంబై, జనవరి 7 (way2newstv.in)
మధ్య తరగతి ప్రజల కలల కారుగా వచ్చిన టాటా నానో, పూర్తిగా కాలగర్భంలో కలసిపోయింది. నానో కారు ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయిందని, 2019లో ఒక్క కారును కూడా తయారు చేయలేదని సంస్థ అఫిషియల్ గా తెలిపింది. రీసెంట్ గా స్టాక్ ఎక్స్ఛేంజీలకు టాటా మోటార్స్ సమాచారాన్ని అందించింది.2018లో తయారు చేసిన ఒకే ఒక్క నానో కారును ఫిబ్రవరి 2019లో విక్రయించామని క్లారిటీ ఇచ్చింది. ప్రజల్లో ఆసక్తి ఉంటే కారును తయారీ చేయడం తిరిగి ప్రారంభిస్తామని చెప్పింది.
నానో ఇక నో
కాగా, ఈ సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి ఇండియా మొత్తం బీఎస్-6 ఉద్గార నిబంధనలు అమలులోకి రానున్న కారణంగా చౌక కార్లను తయారు చేయడం అసాధ్యమేనని వాహన పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.పీపుల్స్ కార్ ’గా రతన్ టాటా పేర్కొన్న నానో ఉత్పత్తిని టాటా మోటార్స్ ఆపేసింది. గత ఏడాది ఒక్క కారును కూడా తయారు చేయలేదని తెలిపింది. అయితే, ఫిబ్రవరిలో మాత్రం ఒకే ఒక్క కారును అమ్మగలిగింది. ఈ కారు తయారీని నిలిపివేస్తున్నట్టు త్వరలోనే అధికారికంగా ప్రకటన చేసే అవకాశాలు ఉన్నా యి. 2018లో ఈ కంపెనీ 88 యూనిట్లను తయారు చేయగా, 82 యూనిట్లను అమ్మింది. అయితే ప్రస్తుతం విధానంలో నానో బీఎస్–6 కారును తయారు చేయలేమని ప్రకటించింది. టాటా మోటార్స్ 2008లో తొలిసారిగా నానో కారును ప్రదర్శించింది. అయితే దీని అమ్మకాలు క్రమంగా తగ్గు తూనే వచ్చాయి. దీంతో ప్రొడక్షన్ ను నిలిపివేసింది.
No comments:
Post a Comment