అనంతపురం జనవరి313 (way2newstv.in)
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిపై హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తీవ్ర విమర్శలు గుప్పించారు. మూడు రాజధానుల వ్యవహారంపై బాలయ్య స్పందిస్తూ.. ఒకే రాష్ట్రం ఒకే రాజధానితో అభివృద్ధి సాధ్యమని స్పష్టం చేశారు. దేశంలో ఎక్కడైనా రాజధాని ఒకే చోట ఉంటుందన్నారు.
జగన్ పాలన అంతా రివర్స్!: బాలకృష్ణ
‘రాష్ట్రంలో అంతా రివర్స్ పాలన సాగుతోంది. నాడు తండ్రి మండలిని పునరుద్ధరిస్తే.. నేడు తనయుడు రద్దు చేస్తున్నాడు. తండ్రి ఆశయాలను నెరవేరుస్తానని అధికారంలోకి వచ్చి నీరుగారుస్తున్నాడు. మండలి చైర్మన్ పట్ల మంత్రుల భాష అభ్యంతరకరం. కక్షసాధింపు చర్యలతో రాష్ట్రాభివృద్ధి కుంటుపడుతుంది’ అని జగన్ సర్కార్‌పై బాలకృష్ణ విమర్శలు గుప్పించారు.
No comments:
Post a Comment