Breaking News

06/01/2020

ఇదేమి ప్రాక్టికల్స్...

నిజామాబాద్, జనవరి 6, (way2newstv.in)
అధ్యాపకులు, ప్రిన్సిపాల్స్‌లో కొంతమంది ప్రాక్టికల్స్‌ చేయిస్తున్నారు, కొందరు చేయిస్తలేరు. వసతుల్లేవు, పరికరాల్లేవు, ల్యాబ్‌ సరిగ్గా లేదు, కెమికల్స్‌ లేవు అని చెప్తున్నారు. మంత్రి చెప్తారు కెమికల్స్‌ ఉన్నాయా? అనుకుంటున్నారు. ఆశ్చర్యమేందంటే చాలా కాలేజీల్లో బ్యూరెట్లు, పిప్పెట్లు ఉన్నాయన్న సంగతి విద్యార్థులకు తెలియదు. బ్యూరెట్‌ ఏదో, పిప్పెట్‌ ఏదో విద్యార్థులు గుర్తించడం లేదు ఎలా వినియోగించాలో తెలియదు.. ఇంటర్‌ ప్రాక్టికల్స్‌ జంబ్లింగ్‌లో నిర్వహించడంపై రాష్ట్ర ప్రభుత్వం ఏటా దాటవేత ధోరణిని అవలంబిస్తున్నది. విద్యార్థుల భవిష్యత్తుకు ఇంటర్మీడియెట్‌ విద్య పునాది. ఇంటర్‌ తర్వాతే ఇంజినీర్లు, డాక్టర్లు, శాస్త్రవేత్తలు ఇలా ఏం కావాలన్నా దారి చూపించేది ఇంటర్‌. ఇంటర్‌ విద్య ఎంత ప్రమాణాలతో ఉంటే భవిష్యత్తులో అంత ఉన్నతస్థాయికి ఎదిగేందుకు దోహదపడుతుంది. అలాంటి ఇంటర్‌ విద్యను రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నది. 
ఇదేమి ప్రాక్టికల్స్...

ప్రాక్టికల్స్‌ నిర్వహణపై పటిష్టమైన చర్యలు చేపట్టడంలో విఫలమవుతున్నది. ల్యాబ్‌ల నిర్వహణ, పరికరాలు, కెమికల్స్‌ కొనుగోలుకు నిధులు కేటాయించ లేదంటే ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా ఉన్నదో అర్థమవుతున్నది. ఇంజినీరింగ్‌ విద్యలో ప్రమాణాలు లేవనే కారణంతో కాలేజీలకు గుర్తింపు రద్దు, సీట్లు, కోర్సులకు కోత విధిస్తున్నది ప్రభుత్వం. విద్యావ్యాపారం చేస్తూ, ప్రాక్టికల్స్‌ నిర్వహించకుండా యధేచ్చగా నిబంధనలు ఉల్లంఘిస్తున్న కార్పొరేట్‌ కాలేజీలపై మాత్రం చర్యలు తీసుకోకుండా ఉదాసీనంగా వ్యవహరిస్తున్నది. ఇంకా కార్పొరేట్‌ విద్యను ప్రోత్సహించే నిర్ణయాలే చేస్తున్నది. ప్రాక్టికల్స్‌ను జంబ్లింగ్‌లో నిర్వహిస్తే ఎగ్జామినర్లు, ఇంటర్‌ బోర్డు అధికారులకు మామూళ్లు ఇవ్వాల్సిన పరిస్థితి తగ్గే అవకాశముంది. తప్పనిసరిగా కాలేజీలన్నీ ల్యాబ్‌లు, పరికరాలు, కెమికల్స్‌ సిద్ధం చేసుకో వాల్సిన అవసరమూ ఏర్పడుతుంది. దీని వల్ల విద్యార్థులకు మేలు కలుగుతుందని విద్యావేత్తలు చెప్తున్నా రు. ఇక ప్రభు త్వ కాలేజీల్లో ల్యాబ్‌లు సరిగ్గా ఉండవు. ఉన్నా ప్రయోగాలకు పనికొచ్చే పరిస్థితి ఉండదు. పరికరాలు, కెమికల్స్‌ కొనేందుకు ప్రభుత్వం నిధులు కేటాయించడం లేదు. గ్రామీణ ప్రాంతాల్లోని కాలేజీల పరిస్థితి మరింత అధ్వానం. అటు కార్పొరేట్‌ కాలేజీలు, ఇటు ప్రభుత్వ కాలేజీల్లో ఇలాంటి పరిణామాలన్నీ తెలిసినా ప్రాక్టికల్స్‌ తప్పనిసరిగా జరపాలని తూతూమంత్రంగా ఆదేశాలు ఇవ్వడం వల్ల ప్రయోజనమేంటనీ విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.ఇంటర్మీడియెట్‌ విద్యలో సైన్స్‌ విద్యార్థులకు ప్రాక్టికల్స్‌ అంతర్భాగం. ఇంటర్‌లో మొత్తం వెయ్యి మార్కులుం టాయి. థీయరీ సబ్జెక్టుల్లో ఎంపీసీ విద్యార్థులకు 940 మార్కులు, బైపీసీ విద్యార్థులకు 880 మార్కులుంటాయి. ప్రాక్టికల్స్‌కు ఎంపీసీ విద్యార్థులకు 60 (భౌతిక శాస్త్రం 30, రసాయన శాస్త్రం 30) మార్కులు, బైపీసీ విద్యార్థులకు 120 (కెమిస్ట్రీ 30, ఫిజిక్స్‌ 30, జంతుశాస్త్రం 30, వృక్షశాస్త్రం 30) మార్కుల చొప్పున ఉంటాయి. ప్రాక్టికల్స్‌ తప్పనిసరిగా ఉత్తీర్ణులు కావాల్సిందే. ఇంకోవైపు ఎంసెట్‌లో ఇంటర్‌ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఉంది. అందుకే ప్రాక్టికల్‌ పరీక్షలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఇంత ప్రాధాన్యత ఉన్నా ప్రాక్టికల్స్‌ పట్ల మెజార్టీ కాలేజీలు నిర్లక్ష్యం వహిస్తున్నాయి. ప్రాక్టికల్స్‌ నిర్వహించకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నాయి. ప్రాక్టికల్స్‌ నిర్వహణ చాలా కాలేజీల్లో డొల్ల అని తెలుస్తున్నది. కార్పొరేట్‌ కాలేజీల్లో ఇక ప్రాక్టికల్స్‌ అనేవి ఓ మాయ. ల్యాబ్‌లుండవు, కెమికల్స్‌, పరికరాలు అసలే ఉండవు. కార్పొరేట్‌ కాలేజీల్లో చదివే విద్యార్థులు థియరీ పరీక్షల్లో మార్కులు, జేఈఈ, నీట్‌, ఎంసెట్‌ వంటి ప్రవేశ పరీక్షల్లో సాధించే ర్యాంకుల పైనే దృష్టి సారిస్తారు. ఇంటర్‌ బోర్డు నుంచి వచ్చే అధికారు లకు మామూళ్లు  ఇచ్చి విద్యార్థులకు పూర్తి మార్కు లు వేయిస్తాయని కార్పొరేట్‌ కాలేజీలపై ఆరోపణలున్నాయి. అందుకే ఎక్కువ మంది సైన్స్‌ విద్యార్థులకు ప్రాక్టికల్స్‌ పట్ల కనీస అవగాహన ఉండడం లేదని తెలుస్తున్నది.ఇంజినీర్లు, డాక్టర్లు, వృత్తి నిపుణులు, శాస్త్రవేత్తలుగా మారేందుకు అవకాశముం టుంది. థియరీ సబ్జెక్టులపై ఎంత పట్టు పెరిగేందుకు ప్రాక్టికల్స్‌ దోహదపడతాయి. రసాయన శాస్త్రంలో లవణ విశ్లేషణ, ఘనపరిమాణాత్మక విశ్లేషణ, కర్బన సమ్మేళనాలు, కొత్త ప్రయోగాలు, వైవా, రికార్డు రాయడం ఉంటాయి. భౌతిక శాస్త్రంలో 20 ప్రయోగాలు న్నాయి. వృక్షశాస్త్రంలో ఆవృత బీజ కుటుంబం, కాండంవేరు చేధం తీయడం, వృక్ష శరీర ధర్మశాస్త్ర ప్రయోగం నిర్వహించడం, స్పాటింగ్‌ బీట్లను గుర్తించాల్సి ఉంటుంది. జంతుశాస్త్రంలో విచ్చేద నాలు, ప్రయోగాల నిర్వహణ, స్పాటర్‌లను గుర్తించాలి.

No comments:

Post a Comment