తాడేపల్లి జనవరి 24 (way2newstv.in)
శాసన మండలి ఛైర్మన్ అనైతికంగా వ్యవహరించారని ఉపముఖ్యమంత్రి అంజద్ బాషా విమర్శించారు. శుక్రవారం అయన మీడియాతో మాట్లాడారు. మండలిలో టీడీపీ సభ్యలు వ్యవహరించిన తీరును ప్రజలు గమనించారు. అభివృద్ధి వికేంద్రీకరణ కోసం సభలో రెండు బిల్లులు ప్రవేశ పెట్టారు. పెద్దల సభల సలహాలు సూచనలు ఇవ్వాలి. బిల్లులు చర్చకు రాకుండా రూల్ 71 తీసుకువచ్చారు. 51 శాతం ఓట్లు 86 శాతం సీట్లు జగన్మోహన్ రెడ్డికి ప్రజలు ఇచ్చారని అయన గుర్తు చేసారు. సభలో చైర్మన్ అనైతికంగా వ్యవహరించారు. చైర్మన్ మండలి చైర్ ను గౌరవించలేదు.
చైర్మన్ ప్రవర్తన అనైతికం
టీడీపీ నాయకుడుగా వ్యవహరించారు. రూల్ ను సభలో అతిక్రమించారు. అన్ని పార్టీలు సభ్యలు రూల్ ప్రకారం నిర్ణయం తీసుకోమన్నారు. బిల్లలును సెలెక్ట్ కమిటికి పంపి చైర్మన్ తప్పు మీద తప్పు చేసారు. చైర్మన్ తీరు పై అన్ని ప్రాంతాల్లో వ్యతిరేక త వ్యక్తమవుతుందని అన్నారు. సభ నిబంధనలు కు విరుద్ధంగా సభలో వీడియోలు తీశారు. చంద్రబాబు కనుసన్నల్లోనే మండలి ఛైర్మన్ నిర్ణయం తీసుకున్నారు. కాలయాపన చేయాడం కోసమే సెలెక్ట్ కమిటీకి పంపారు. సభలో టీడీపీ సభ్యలు గుండాలు రౌడీలు గా వ్యవహరిస్తే చంద్రబాబు వారిని సెబాస్ అని మెచ్చుకున్నారు. చంద్రబాబుకు కుల రాజకీయాలు చేయడం వెన్నతో పెట్టిన విద్య. చంద్రబాబు కులాలు మద్య చిచ్చు పెట్టె ప్రయత్నం చేస్తున్నారు. శవ రాజకీయాలు చేయడంలో చంద్రబాబు మించిన వారు దేశంలో మరొకరు లేరు. ప్రజలు అందరు మూడు రాజధానులు విషయాన్ని స్వాగతిస్తున్నారని అయన అన్నారు.
No comments:
Post a Comment