Breaking News

24/01/2020

ఆర్హులందరికీ ఇళ్ల పట్టాలు

సమీక్షా భేటీలో సీఎం జగన్
అమరావతి జనవరి 24 (way2newstv.in)
అర్హులైన పేదలందరికీ ఇళ్లిచ్చే కార్యక్రమాన్ని అత్యంత ప్రాధాన్యమైనది. అర్హులు ఎంతమంది ఉన్నా అందరికీ ఇళ్లపట్టాలు ఇవ్వాల్సిందే. ప్రజాసాధికార సర్వే అన్నది ప్రమాణం కాకూడదు. వాలంటీర్లు, వారు క్షేత్రస్థాయిలో గుర్తించిన అంశాలు ప్రామాణికం కావాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అన్నారు. శుక్రవారం అయన క్యాంపు కార్యాలయంలో ఉగాది నాటికి పేదలందరికీ ఇళ్లపట్టాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అధికారులు,  ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ హజరయ్యారు. సీఎం మాట్లాడుతూ ఇళ్లపట్టాల కోసం అధికారులు గుర్తిస్తున్న స్థలాలు ఆవాసయోగ్యంగా ఉండాలన్న ప్రాథమిక విషయాన్ని మరిచిపోకూడదు. అందరికీ పట్టాలు ఇవ్వాలి కదా అని... లబ్ధిదారులకు ఉపయోగం లేని చోట ఇవ్వడంలో అర్థం లేదని అన్నారు. 
ఆర్హులందరికీ ఇళ్ల పట్టాలు

ఇళ్లపట్టాలు ఇస్తున్న స్థలాలు పట్ల లబ్ధిదారులు సంతృప్తి వ్యక్తంచేయాలి. లబ్ధిదారులకు ఆవాస యోగ్యంగా ఎండాలి. ఈ అంశాలను అధికారులు దృష్టిలో పెట్టుకోవాలి. వీలైనంత వరకు ఇళ్లపట్టాలకోసం అసైన్డ్ల్యాండ్స్ను తీసుకోవద్దు.  ఇక ఏమార్గం లేక తప్పదు  అనుకుంటే వారికి పూర్తిస్థాయిలో పరిహారం ఇవ్వాలని సూచించారు. ఇళ్ల పట్టాల కోసం సడలించిన అర్హతల వివరాలను గ్రామ సచివాలయాల్లో డిస్ప్లే చేయాలని సీఎం ఆదేశించారు.  వివరాలన్నింటినీ గ్రామ సచివాలయాలకు అందుబాటులో ఉంచాలని అన్నారు. ఇంకా ఎవరైనా అర్హులు ఉంటే.. వారు దరఖాస్తు చేసుకునేలా ఆ సమాచారం గ్రామ సచివాలయాలకు అందుబాటులో ఉండాలి. లబ్ధిదారుల అభిప్రాయం తప్పనిసరిగా తీసుకోవాలి. ఇళ్లపట్టాల కోసం ఎంపికచేసిన స్థలాలపై లబ్ధిదారులు ఆమోదం తెలిపిన తర్వాతనే ప్లాటింగ్ చేయాలి. లేకపోతే డబ్బు వృథా అవుతుందని అయన అన్నారు. ఇళ్లపట్టాలకోసం కేటాయించిన స్థలాల్లో చెట్లను కూడా పెంచాలి. మంగళగిరి, తాడేపల్లి మున్సిపాల్టీల్లో లబ్ధిదారులు అందరికీ ఇళ్లపట్టాలు ఇవ్వాలని అన్నారు. ఇళ్లపట్టాలు ఇవ్వగానే ఇళ్లు కట్టడానికి, లబ్ధిదారులు అక్కడకు వెళ్లడానికి సిద్ధంగా ఉండాలి. ఈ విషయంలో అధికారులు హడావిడిగా వ్యవహరించడం తగదని అన్నారు. ఫిబ్రవరి 1 నుంచి నేను గ్రామాల్లో పర్యటిస్తాను. రాండమ్గా ఒక పల్లెలోకి వెళ్లి పరిశీలిస్తాను. లబ్ధిదారుల ఎంపిక, పథకాలు అమలు జరుగుతున్న తీరును స్వయంగా పరిశీలిస్తానని వెల్లడించారు.

No comments:

Post a Comment