Breaking News

04/01/2020

మధుమేహ వ్యాధిగ్రస్తులకు త్వరలో అందుబాటులోకి మందు

ఇక ఇన్సూలిన్ ను సూదిలా గుచ్చుకునే వారికి ఉపశమనం
న్యూఢిల్లీ జనవరి 4 (way2newstv.in)
మీకు షూగర్ ఉందా.? రోజూ టాబ్లెట్ వేసుకుంటున్నారా? తీవ్రమైన మధుమేహం ఉంటే ప్రతీ రోజు ఇన్సూలిన్ ను సూదిలా గుచ్చుకునే వారు ఎందరో.. ఇక ఈ కష్టాలన్నింటికి తెరపడనుంది. అవును మధుమేహ వ్యాధిగ్రస్తులకు అమెరికా పరిశోధకులు గొప్ప శుభవార్త చెప్పారు. కృత్రిమ క్లోమాన్ని అందుబాటు లోకి తెచ్చారు. వైద్య చరిత్ర లోనే పూర్తిగా నయం చేయలేని షుగర్ వ్యాధికి ఎట్టకేలకు మందు లభించనుంది.
మధుమేహ వ్యాధిగ్రస్తులకు త్వరలో అందుబాటులోకి మందు

అమెరికాలోని ‘యూనివర్సిటీ ఆఫ్ వర్జీనియా సెంటర్ ఫర్ డయాబెటీస్ టెక్నాలజీ’ సంస్థ అభివృద్ధి చేసిన సాంకేతిక సహాయంతో కృత్రిమ క్లోమ వ్యవస్థ ను తయారు చేశారు. ‘టాండమ్ డయాబెటిస్ కేర్ ’ సంస్థ దీన్ని రూపొందించింది.ఈ కృత్రిమ క్లోమం రక్తంలో గ్లూకోజ్ నిల్వలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైన స్థాయి లో తనంతట తానే ఇన్సులిన్ ను విడుదల చేస్తుంది. ఇది మధుమేఘ రోగుల కష్టాలను తీర్చనుంది.కంట్రోల్-ఐక్యూగా వర్జీనియా శాస్త్రవేత్తలు దీనికి పేరు పెట్టారు. ప్రస్తుతం అమెరికాకు చెందిన ‘ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ’ దీనికి ఆమోద ముద్ర వేసింది.దీంతో ఈ కృత్రిమ క్లోమ మందు అమెరికా మార్కెట్లోకి రానుంది. ఇండియాకు వస్తుంది. మధుమేహ వ్యాధి నియంత్రణలో ఇది భారీ ముందడుగుగా అభివర్ణిస్తున్నారు. జీవితాంతం మందులు సూదులు వాడే వారికి ఇది గొప్ప స్వాంతనగా చెప్పవచ్చు.

No comments:

Post a Comment