శ్రీకాకుళం జనవరి 31 (way2anewstv.in)
శ్రీకాకుళం జిల్లా హిరమండలంలోని గొట్టా బ్యారేజ్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి వంశధార ఎడమ కాలువలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా ముగ్గురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. విశాఖలోని కోరమాండల్ ఫెర్టిలైజర్స్ సంస్థలో ఏరియా మేనేజర్లుగా పనిచేస్తున్న పవన్ చంద్రమోహన్ తో పాటు మరో ముగ్గురు ఒడిశాలోని పర్లాఖెముండి వెళ్లారు.
కాలువలో కారు…ఇద్దరు మృతి
అక్కడ సెంచూరియన్ యూనివర్సిటీలో సమావేశానికి హాజరై తిరిగి వస్తుండగా అర్ధరాత్రి సమయంలో గొట్టాబ్యారేజ్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. పవన్ స్వస్థలం రాజమహేంద్రవరం కాగా.. చంద్రమోహన్ది ఖమ్మం. స్వల్ప గాయాలతో బయటపడిన వారిని వెంకటగిరి ప్రసాద్,మహేశ్వరరావు, ఎస్.దుర్గా నాగ ప్రవీణ్గా గుర్తించారు. ప్రమాదం జరిగిన సమయంలో కాలువలో 9 అడుగుల మేర నీరు ప్రవహిస్తోంది. నీటిని నిలుపుదల చేసి మృతదేహాలను బయటకు తీశారు. కేసు నమోదు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
No comments:
Post a Comment