Breaking News

13/01/2020

నేరం రుజువని తేలితే జగన్ కు కోర్టు శిక్ష విధిస్తుంది: సీబీఐ మాజీ జేడీ

విజయవాడ జనవరి 13 (way2newstv.in)
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో అసలు ఏం జరగనుందని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణను ఆసక్తికర విషయాలు వెల్లడించారు.. సోషల్ మీడియాలో ఎవరి అభిప్రాయాలు వారు చెబుతుంటారని, చట్టం ప్రకారం జరగాల్సింది జరుగుతుందని లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు. తానూ అందరిలా అభిప్రాయాన్ని వ్యక్తం చేయలేనని స్పష్టం చేశారు. ప్రతి కేసులోనూ విచారణ జరగడం, సాక్ష్యాలు, ఆధారాలు సేకరించడం, వాటిని కోర్టులో సమర్పించడం.. వాటి ఆధారంగా కోర్టు నిర్ణయం తీసుకుని శిక్ష విధించడటమా? లేక మరేదైననా అని తేలుస్తుందని చెప్పారు. జగన్ కేసు విషయంలోనూ ఆ విధంగానే జరుగుతుందని చెప్పుకొచ్చారు. 
నేరం రుజువని తేలితే జగన్ కు కోర్టు శిక్ష విధిస్తుంది: సీబీఐ మాజీ జేడీ

తాను విచారణాధికారిగా ఉన్నప్పుడు దాఖలు చేసిన చార్జిషీటు ప్రకారం ఆధారాలను కోర్టులో సమర్పించడం జరిగిందని తెలిపారు. వాటిపై ట్రయల్స్ నడుస్తున్నాయని వివరించారు. ఇరు పక్షాల వాదనలు ప్రతివాదనల అనంతరం నేరం రుజువని తేలితే కోర్టు శిక్ష విధిస్తుందని, లేదంటే నిర్ధోషిగా ప్రకటిస్తుందని లక్ష్మీనారాయణ చెప్పుకొచ్చారు. వంద మంది నేరస్తులు తప్పించుకున్నా.. ఒక్క నిర్దోషికి కూడా శిక్ష పడొద్దు అనేది భారతదేశ న్యాయ వ్యవస్థ సూత్రం అని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరుగుతోన్న విషయం తెలిసిందే. అంతేకాదు.. రాజకీయ వర్గాలు, విశ్లేషకులు కూడా ఇదే అభిప్రాయాన్ని దాదాపుగా వ్యక్తపరుస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ త్వరలోనే జైలుపాలు కాబోతున్నారంటూ సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరుగుతోన్న విషయం తెలిసిందే.

No comments:

Post a Comment