జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్
సిరిసిల్ల జనవరి 20, (way2newstv.in):
ఓటు చాలా విలువైనది ఓటు హక్కు గల ప్రతి ఒక్కరు స్వేచ్చగా, నిర్బయంగా తమకు నచ్చిన వ్యక్తికి ఓటు వేసి, తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ పిలుపునిచ్చారు. సోమవారం సిరిసిల్ల మున్సిపాలిటీ కార్యాలయం అవరణలో సిరిసిల్ల మున్సిపాలిటీ పరిధిలో ఓటర్లను చైతన్యపరుచుటకు వీలుగా ఏర్పాటు చేసిన “ ఓటర్ చైతన్య రథాన్ని కలెక్టర్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు 18 సంవత్సరాలు నిండి ఓటర్ గా నమోదు చేసుకున్న ప్రతి ఒక్కరు మున్సిపాల్ ఎన్నికలలో తమ ఓటు హక్కు ను వినియోగించుకోవాలని సూచించారు. మీ విలువైన ఓటును ప్రలోబాలకు లొంగి దుర్వినియోగం చేసుకోవద్దని, మనం వేసే ఒక ఓటు మన నగర, రాష్ట్ర, దేశ ప్రగతిని నిర్ణయింస్తుందని తెలిపారు.
నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి :
ప్రజాస్వామ్య దేశం లో ఓటును కలిగి ఉండడం ప్రతి పౌరుడి హక్కు కాగా పౌరుడిగా ఓటు వేయడం మన కనీస భాద్యత అని అన్నారు. మీరు ఓటు వేయడమే కాకుండా మీ ఇంట్లో, చూట్టూ ప్రక్కల ఓటు హక్కు కలిగి ఉన్న వారందరి చే ఓటు వేసే విధంగా ప్రోత్సహించాలని సూచించారు. ఓటు గురించి తెలుసుకోవాడానికి కరీంనగర్ కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన, టోల్ ఫ్రీ నెంబర్ 1950, హెల్ప్ లైన్ 9398684240 నెంబర్ కి కాల్ చేసి తెలుసుకోవచ్చునని తెలిపారు. మీ ఓటర్ స్లిప్ లను డౌన్ లోడ్ చేసుకోనే అవకాశాన్ని ఎన్నికల సంఘం కల్పించిందని అన్నారు. ఇందుకోసం తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు చెందిన వెబ్ సైట్లోకి వెళ్ళాలని అక్కడ మీ ఓటర్ ఐ.డి. ఎంటర్ చేసి ఓటర్ స్లిప్ పొందవచ్చని సూచించారు. ఓటు వేయడానికి వెళ్ళినప్పుడు ఓటర్ స్లిప్ తో పాటు గుర్తింపు కార్డును తీసుకెళ్ళాలని కలెక్టర్ సూచించారు. అనంతరము ఓటర్ అవగాహన పై ముద్రించిన కర పత్రాలను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ ఓటర్ చైతన్య రథం నగర పాలక సంస్థ పరిధిలోని సిరిసిల్ల మున్సిపాలిటీ పరిధిలో ఓటర్ చైతన్యం పై ప్రచారం నిర్వహిస్తుందని కలెక్టర్ తెలిపారు. అనంతర కలెక్టర్ సిరిసిల్ల మున్సిపాలిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం నుంచి డా బి ఆర్ అంబేడ్కర్ కూడలి వరకు నిర్వహించిన ఓటరు అవగాహన ర్యాలీ లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం లో మున్సిపల్ కమిషనర్ శ్రీ సమ్మయ్య టౌన్ ప్లానింగ్ అధికారి శ్రీ ఆన్సర్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment