వరంగల్ జనవరి 20 (way2newstv.in)
కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో అభివృద్ధి శూన్యమని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. వర్థన్నపేట మున్సిపల్ ఎన్నికల రోడ్‌షోలో మంత్రి నేడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి శూన్యమన్నారు. టీఆర్‌ఎస్ హాయాంలో వర్థన్నపేట ఎంతో అభివృద్ధి చెందిందన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో అభివృద్ధి శూన్యం: ఎర్రబెల్లి
వర్థన్నపేట గ్రామపంచాయతీని మున్సిపాలిటీ చేసుకున్నామన్నారు. రూ. 2 వేల పింఛన్ ఇచ్చి వృద్ధులను టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఆదుకుంటోందన్నారు. తాగునీటికి, సాగునీటికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసి చెరువుల్లో నీళ్లు నింపిన ఘనత సీఎం కేసీఆర్‌దేనన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో పల్లెల్లో పచ్చదనం వెల్లివిరిసిందన్నారు. అదే విధంగా త్వరలోనే పట్టణ ప్రగతి కార్యక్రమం చేపట్టబోతున్నట్లు తెలిపారు.
No comments:
Post a Comment