Breaking News

09/12/2019

యడ్డీకి లైఫ్‌ ఇచ్చిన ఉపఎన్నికలు

బెంగుళూర్, డిసెంబర్ 9 డిసెంబర్ 9  (way2newstv.in)
కర్ణాటకలో ఇటీవల జరిగిన 15 అసెంబ్లీ ఉప ఎన్నికల్లో బీజేపీ 12 సీట్లలో విజయం సాదించింది. ఎగ్జిట్ పోల్స్ కు తగ్గటుగా ఊహించినట్లుగానే బీజేపీకి అనుకూలంగా తీర్పు వెలువడనున్నట్లు తెలుస్తోంది. దీంతో కర్ణాటక రాజకీయాల్లో ఏర్పడిన సంక్షోభం ఇక శాశ్వతంగా సమసిపోయినట్లే అని పలువురు రాజకీయ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. అసెంబ్లీలో ప్రస్తుతం మైనార్టీ ప్రభుత్వాన్ని నెట్టుకొస్తున్న ముఖ్యమంత్రి యడియూరప్ప సర్కార్‌కు  ఉప ఎన్నికల ఫలితాలు మంచి జోష్‌ను నింపేలా ఉన్నాయి. యడ్డీ సర్కార్‌ను నిలబడాలంటే 15 స్థానాల్లో కనీసం ఆరు స్థానాల్లో అధికార పార్టీ సభ్యులు విజయం సాధిస్తే చాలు.ప్రస్తుతం అసెంబ్లీలో బీజేపీకి 105 మంది సభ్యుల మద్దతు ఉండగా.. ఉప ఎన్నికల్లో కనీసం ఆరు స్థానాల్లో గెలుపొందినా ఆ సంఖ్య 111కి చేరుతుంది. దీంతో ఉత్కంఠ భరిత స్థితిలో ముఖ్యమంత్రి పీఠం చేజిక్కించుకున్న బీఎస్ యడియూరప్ప సీటుకు వచ్చిన ఢోకా ఏం లేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 
యడ్డీకి లైఫ్‌ ఇచ్చిన ఉపఎన్నికలు

ప్రస్తుతం వెలువడుతున్న ఉప ఎన్నికల ఫలితాలు బీజేపీకి మరింత ఊరటను కలిగిస్తున్నాయి. కన్నడలో ఇక తమకు తిరుగులేదని బీజేపీ నేతలు ఇప్పటికే ప్రకటించారు. కన్నడ ప్రజలు సుస్థిర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని, జేడీఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలకు ఇక కాలం చెల్లినట్టే అని ఫలితాలపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పలు ప్రాంతాల్లో బీజేపీ శ్రేణులు సంభరాలు కూడా ప్రారంభించారు.ఇక యడియూరప్ప సర్కార్‌ను మరోసారి కూల్చాలని కలలుకన్న జేడీఎస్‌, కాంగ్రెస్‌లకు ఉప ఎన్నికల్లో చేదు పలితాలే ఎదురయ్యేలా ఉన్నాయి. అన్ని స్థానాల్లో వేరువేరుగా పోటీకి దిగిన విపక్షాలు అధికార బీజేపీకి కనీసం పోటీ కూడా ఇవ్వనట్లు తెలుస్తోంది. కేవలం ఐదు స్థానాల్లో మాత్రమే విపక్షాలు ముందంజలో ఉన్నాయి. ఇప్పటికే వరుస ఓటములతో ఢీలా పడ్డ కాంగ్రెస్‌కు ఉప ఎన్నికల ఫలితాలు మరింత నిరాశను మిగిల్చేలా ఉన్నాయి. మధ్యాహ్నాంలోపు అన్ని స్థానాల్లో ఫలితాలు విడుదలయ్యాలా ఉన్నాయి. 15 అసెంబ్లీ స్థానాలకు ఈ నెల 5వ తేదీన పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. 15 మంది కాంగ్రెస్, జేడీఎస్ సభ్యులపై స్పీకర్‌ అనర్హత వేటు వేయడంతో ఉప ఎన్నికలు అనివార్యం అయ్యాయి.
వారందిరికి మంత్రి వర్గంలో చోటు
కర్ణాటక ఉప ఎన్నికల్లో యడియూరప్ప ప్రభుత్వం అధికారాన్ని నిలబెట్టుకుంది. తాజా ఎన్నికల ఫలితాల్లో బీజేపీ విజయ దుందుభిని మోగించింది. 15 అసెంబ్లీ స్థానాలకు గాను 6 చోట్ల విజయం సాధించి, మరో 6 స్థానాల్లో ఆదిక్యంలో కొనసాగుతుంది. దీంతో కర్ణాటకలో స్థిరమైన బీజేపీ ప్రభుత్వానికి మార్గం సుగమమైంది.  కాగా,  ఉప ఎన్నికల్లో  కాంగ్రెస్‌ రెండు సీట్లతో సరిపెట్టుకుంది. ఇక జేడీఎస్‌ ఖాతా కూడా తెరవలేదు. మొదటి రౌండ్‌ నుంచి ఆధిక్యం ప్రదర్శించిన బీజేపీ.. అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంది. మిగత 6 స్థానాల్లో కూడా బీజేపీ గెలుపు దాదాపు ఖరారయినట్లే. ఎన్నికల్లో గెలిచిన 12 మంది బీజేపీ ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో చోటు కల్పిస్తానని సీఎం యడియూరప్ప ప్రకటించారు. కాంగ్రెస్‌- జేడీఎస్‌ కూటమికి చెందిన 17మంది తిరుగుబాటు చేయడంతో కర్ణాకటలోని కుమారస్వామి ప్రభుత్వం కుప్పకూలిన సంగతి తెలిసిందే. తర్వాత అప్పటి స్పీకర్‌ 17మందిపై అనర్హత వేటు వేసింది. తర్వాత బలపరీక్షలో బీజేపీ నెగ్గి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఎమ్మెల్యేల అనర్హతతో కర్ణాటకలో ఉప ఎన్నికలు వచ్చాయి. ఎమ్మెల్యేల అనర్హతతో 17 స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా, హైకోర్టు కేసు కారణంగా రెండు చోట్ల ఎన్నికలు వాయిదా పడ్డాయి. దీంతో డిసెంబర్‌ 5న 15 స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. బీజేపీ, కాంగ్రెస్‌లు మొత్తం 15 స్థానాల్లో, జేడీఎస్‌ 12 చోట్ల బరిలోకి దిగాయి.ఎమ్మెల్యేలుగా గెలిచిన 12 మంది సభ్యులకు మంత్రివర్గంలో అవకాశం కల్పిస్తామని కర్ణాటక మంత్రి అశోక్ అన్నారు. బీజేపీ కచ్చితంగా 12 స్థానాల్లో గెలుస్తుంది. వారందరికి సీఎం యడియురప్ప సముచిత స్థానం కల్పిస్తారా ఆశాభావం వ్యక్తం చేశారు.

No comments:

Post a Comment