Breaking News

14/12/2019

ఆర్టీసీ కార్మికులెవరూ సంతోషంగా లేరు: అశ్వత్థామరెడ్డి

హైదరాబాద్ డిసెంబర్ 14   (way2newstv.in)
ఆర్టీసీ కార్మికులెవరూ సంతోషంగా లేరని, డిపోలలో రెండేళ్ల వరకు ఎన్నికలు వద్దని సంకేతాలు ఇవ్వడం సరికాదని అశ్వత్థామరెడ్డి అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మహిళల డ్యూటీ విషయంలో సీఎం ఆదేశాలను అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. ప్రజాస్వామ్య దేశంలో ట్రేడ్ యూనియన్లు ఉండాలని, యూనియన్‌ ఎన్నికలు జరపాల్సిందేనని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. యూనియన్లకు సంబంధించి రహస్య ఓటింగ్ పెట్టాలని, మెజార్టీ అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. 
ఆర్టీసీ కార్మికులెవరూ సంతోషంగా లేరు: అశ్వత్థామరెడ్డి

సంక్షేమ కౌన్సిల్‌లో సభ్యులను ఏ ప్రాతిపదికన తీసుకున్నారో చెప్పాలని అశ్వత్థామరెడ్డి నిలదీశారు. బెంగళూరులో 7 వేల బస్సులు ఉన్నాయని, హైదరాబాద్‌లో 3,500 బస్సుల్లో వెయ్యి బస్సులు రద్దు చేస్తున్నారని అశ్వత్థామరెడ్డి విమర్శించారు. బస్సులను కుదించడం వల్ల ఆదాయం వస్తుందేమో కానీ.. ప్రయాణికులు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడతారని అన్నారు. చట్ట వ్యతిరేకంగా కేటాయించే డ్యూటీల్ని ఎత్తివేయాలని, లేకుంటే కార్మికశాఖకు ఫిర్యాదు చేస్తామన్నారు. సమ్మె కాలంలో కొందరు అధికారులు అవినీతికి పాల్పడ్డారని, వారిపై విచారణ జరిపి వెంటనే చర్యలు తీసుకోవాలని అశ్వత్థామరెడ్డి డిమాండ్ చేశారు.

No comments:

Post a Comment