Breaking News

20/12/2019

జగన్ ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారు: మాజీ మంత్రి కొల్లు

విజయవాడ డిసెంబర్ 20  (way2newstv.in):
ఏపీ సీఎం జగన్ ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. మూడు ప్రాంతాల్లో రాజధానులు అంటే చాలా ఇబ్బందులు తలెత్తుతాయన్నారు. అధికారులకు సమయం వృథాతో పాటు ఖర్చు కూడా అవుతుందన్నారు. ఏదైనా జీవో విడుదల చేశాక ఎవరన్నా కోర్టుకు వెళితే అధికారులు వైజాగ్ నుంచి కర్నూల్ వెళ్లాల్సి వస్తుందని కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.
జగన్ ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారు: మాజీ మంత్రి కొల్లు

రాజధాని మారిస్తే ప్రాంతాలు అభివృద్ధి జరుగుతుందనేది అవాస్తవమన్నారు. కంపెనీలు వస్తే అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి జరుగుతుందన్నారు. సీఎం జగన్నాటకం అడుతున్నారని మండిపడ్డారు. మంత్రుల పొంతన లేని మాటల వల్ల ప్రజల్లో గందరగోళం ఏర్పడుతోందన్నారు. రాజధాని మార్పుపై కేంద్రం స్పందించాలని కొల్లు రవీంద్ర డిమాండ్ చేశారు.

No comments:

Post a Comment