Breaking News

20/12/2019

మానవ హక్కుల కమిషన్ చైర్మన్‌గా జస్టిస్ జీ చంద్రయ్య

హైదరాబాద్ డిసెంబర్ 20 (way2newstv.in)
తెలంగాణ లోకాయుక్త, ఉపలోకాయుక్త, మానవ హక్కుల కమిషన్లను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్‌గా జస్టిస్ జీ చంద్రయ్య, సభ్యులుగా ఆనందరావు, మహ్మద్ ఇర్ఫాన్ మొయినుద్దీన్‌లను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. 
మానవ హక్కుల కమిషన్ చైర్మన్‌గా జస్టిస్ జీ చంద్రయ్య

జస్టిస్ జీ చంద్రయ్య గతంలో హైకోర్టు న్యాయమూర్తిగా, ఆనందరావు జిల్లా జడ్జిగా పనిచేసి రిటైర్ అయ్యారు. మహ్మద్ ఇర్ఫాన్ మొయినుద్దీన్‌ను (నాన్ జుడిషియల్) సభ్యుడిగా నియమించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన సిఫారసులను గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ ఆమోదించారు. దీనితో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషిఉత్తర్వులు జారీచేశారు

No comments:

Post a Comment