Breaking News

28/12/2019

చిన్న వాళ్లతో సెక్స్ సీన్స్ నటిస్తా : కరీనా

ముంబై, డిసెంబర్ 28, (way2newstv.in)
బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ ఖాన్‌కు బాలీవుడ్‌లో ఇప్పటికీ ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు. పెళ్లై, ఓ పిల్లాడికి తల్లైనా కూడా ఓ కుర్ర హీరోయిన్‌కి వచ్చే అవకాశాల కంటే ఎక్కువ ఛాన్సెస్ కరీనాకు వస్తున్నాయి. అయితే ఇక నుంచి తన కంటే చిన్న వయసున్న కుర్ర హీరోలతో రొమాంటిక్, సెక్సీ సన్నివేశాల్లో నటించాలని అనుకుంటున్నట్లు కరీనా వెల్లడించారు. తాను ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రానే అని అన్నారు.‘నా వయసు పెరిగే కొద్దీ నేను నా కంటే చిన్న వయసున్న హీరోలతో రొమాన్స్ చేస్తాను. పెద్ద వయసువారు చిన్న వయసు వారితో కలిసి రొమాన్స్ చేయలేరు అన్న అభిప్రాయాన్ని మారుస్తాను. 
చిన్న వాళ్లతో సెక్స్ సీన్స్ నటిస్తా : కరీనా

ప్రేమలో పడటానికి వయసుతో సంబంధం లేదు. కావాలంటే ప్రియాంక చోప్రాను చూడండి. తన కంటే పదేళ్లు చిన్న వయసున్న కుర్రాడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. నేను కూడా నాకంటే పదేళ్లు పెద్దవాడైన సైఫ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. అందులో తప్పు లేదు. అయితే అలాంటి సినిమాలు తీయకూడదు అనుకుంటున్న నిర్మాతల ఆలోచనా విధానంలోనూ మార్పులు రావాలి’ అని వెల్లడించారు కరీనా.అక్షయ్ కుమార్‌తో కలిసి కరీనా కపూర్ నటించిన ‘గుడ్ న్యూస్’ ఇటీవల విడుదలై బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. రాజ్ మెహతా డైరెక్ట్ చేసిన ఈ సినిమా ప్రేక్షకులను పొట్ట చెక్కలయ్యేలా నవ్వించింది. ప్రస్తుతం ఆమె ‘లాల్ సింగ్ చద్దా’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఇందులో ఆమె ఆమిర్ ఖాన్‌తో కలిసి రొమాన్స్ చేయబోతున్నారు. దీంతో పాటు కరణ్ జోహార్ నిర్మిస్తున్న ‘తఖ్త్’ సినిమాలోనూ నటించారు

No comments:

Post a Comment