Breaking News

14/12/2019

ఇక మంత్రి పదవుల పంచాయితీ

బెంగళూర్, డిసెంబర్ 14  (way2newstv.in)
కర్ణాటకలో జరిగిన ఉప ఎన్నికల్లో యడ్యూరప్ప శాసనసభ్యులను గెలిపించుకని ప్రభుత్వాన్ని సుస్థిరం చేసుకోగలిగారు కాని ఆయనకు మంత్రి వర్గ కూర్పు మరో సవాల్ లా మారిందనే చెప్పాలి. ఇటు సొంత పార్టీ నేతలు, అటు తాను ముఖ్యమంత్రి అయ్యేందుకు సహకరించిన కొత్తనేతలు. ఇద్దరి మధ్య యడ్యూరప్ప నలిగి పోతున్నారనే చెప్పాలి. ఆయన కేంద్ర నాయకత్వం పిలుపు కోసం ఎదురు చూస్తున్నారు. పార్లమెంటు సమావేశాలు ఉండటంతో త్వరలోనే ఢిల్లీ పెద్దల నుంచి పిలుపు వస్తుందని యడ్యూరప్ప ఆశిస్తున్నారు.ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి. శని, ఆదివారాలు సెలవు దినాలు కాబట్టి యడ్యూరప్పకు ఢిల్లీ నుంచి పిలుపు వచ్చే అవకాశముంది. నిజానికి ఇంకా దాదాపు 16 మందిని మంత్రివర్గంలో యడ్యూరప్ప చేర్చుకునే అవకాశముంది. 
ఇక మంత్రి పదవుల పంచాయితీ

యడ్యూరప్ప ముఖ్యమంంత్రి అయిన తర్వాత ఒకసారి మాత్రమే విస్తరణ జరిగింది. ఆ విస్తరణలో కూడా యడ్యూరప్ప అనుకున్న విధంగా జరగలేదు. ముగ్గురు ఉప ముఖ్యమంత్రులను కేంద్ర నాయకత్వం నియమించింది.తర్వాత ఉప ఎన్నికలకు ముందు మంత్రి వర్గ విస్తరణ చేయాలన్న యడ్యూరప్ప ప్రతిపాదననూ కేంద్ర నాయకత్వం తిరస్కరించింది. ఇప్పుడు అనర్హత వేటు పడి తిరిగి ఉప ఎన్నికల్లో గెలిచిన వారికి మంత్రిపదవులు ఇస్తానని యడ్యూరప్ప మాట ఇచ్చారు. వారికి టిక్కెట్లు ఇప్పంచేందుకే యడ్యూరప్ప సతమతమయ్యారు. ఇప్పుడు వీరందరికీ మంత్రి పదవులు ఇవ్వడానికి కేంద్ర నాయకత్వం అంగీకరిస్తుందా? అన్నది ప్రశ్న. ఓటమి పాలయిన వారికి కూడా మంత్రి పదవులు ఇవ్వాలని యడ్యూరప్ప భావిస్తున్నారు. టిక్కెట్ రాని శంకర్ లాంటి నేతలకు కూడా కేబినెట్ లో స్థానం కల్పించాలనుకుంటున్నారు.ప్రస్తుతమున్న పరిస్థితుల్లో కేంద్ర నాయకత్వం తన మాట వింటుందనే ధీమాతో ఉన్నారు యడ్యూరప్ప. ఉప ఎన్నికల్లో పన్నెండు స్థానాల్లో గెలిపించుకుని అధికారాన్ని తిరిగి నిలబెట్టుకున్న యడ్యూరప్ప పై బీజేపీ అగ్రనేతలు సయితం ప్రశంసలు కురిపించారు. అయితే అడ్డగోలు నిర్ణయాలకు కేంద్ర నాయకత్వం అంగీకరిస్తుందా? అన్నది తేలాల్సి ఉంది. మరోవైపు బీజేపీ సీనియర్ నేతలు సయితం మంత్రి పదవులు ఆశిస్తున్నారు. వీరందరినీ యడ్యూరప్ప ఏ మేరకు సంతృప్తి పరుస్తారన్నది వేచి చూడాలి.

No comments:

Post a Comment