Breaking News

04/12/2019

'స్థిరంగా పెట్రోల్, డీజిల్ ధరలు

హైద్రాబాద్,  డిసెంబర్ 4 (way2newstv.in)
దేశీ ఇంధన ధరలు స్థిరంగానే ఉంటూ వస్తున్నాయి. బుధవారం పెట్రోల్ ధరలో ఎలాంటి మార్పు లేదు. డీజిల్ ధర కూడా ఇదే దారిలో నడిచింది. దీంతో హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్ ధర రూ.79.74 వద్దనే ఉంది. డీజిల్ ధర కూడా రూ.71.79 వద్దనే నిలకడగా కొనసాగుతోంది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరిగాయి.అమరావతిలో కూడా పెట్రోల్, డీజిల్ ధరల పరిస్థితి ఇలానే ఉంది. పెట్రోల్‌ ధర రూ.79.30 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. డీజిల్‌ ధర కూడా రూ.71.09 వద్ద నిలకడగా ఉంది. ఇక విజయవాడలోనూ ధరలు ఇలానే ఉన్నాయి. 
'స్థిరంగా పెట్రోల్, డీజిల్ ధరలు

పెట్రోల్ ధర రూ.78.93 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. డీజిల్ ధర కూడా రూ.70.75 వద్ద నిలకడగా ఉంది.దేశ రాజధాని ఢిల్లీలో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు ఇలానే ఉన్నాయి. పెట్రోల్ ధర రూ.74.91 వద్ద స్థిరంగా ఉంది. డీజిల్ ధర కూడా రూ.65.78 వద్ద నిలకడగా కొనసాగుతోంది. వాణిజ్య రాజధాని ముంబయిలో కూడా పరిస్థితి ఇలానే కనిపిస్తోంది. పెట్రోల్ ధర రూ.80.59 వద్ద స్థిరంగా ఉంది. డీజిల్ ధర కూడా రూ.69.00 వద్ద నిలకడగా కొనసాగుతోంది.అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు (క్రూడాయిల్) ధరలు పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌‌కు 0.36 శాతం పెరుగుదలతో 61.04 డాలర్లకు చేరింది. ఇక డబ్ల్యూటీఐ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 0.39 శాతం పెరుగుదలతో 56.32 డాలర్లకు ఎగసింది.ఇకపోతే పెట్రోల్, డీజిల్ ధరలు ప్రతి రోజు మారుతూ వస్తుంటాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరల ప్రాతిపదికన ఇంధన రిటైల్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను సవరిస్తూ వస్తుంటాయి. ఈ నేపథ్యంలోనే ధరలు ఒక రోజు పెరగొచ్చు. మరో రోజు తగ్గొచ్చు.

No comments:

Post a Comment