Breaking News

30/12/2019

హైదరాబాద్ భారీ సెక్స్ రాకెట్ గుట్టురట్టు

హైద్రాబాద్, డిసెంబర్ 30, (way2newstv.in)
హైదరాబాద్‌ శివారులో గుట్టుగా సాగుతున్న భారీ సెక్స్‌రాకెట్‌ను పోలీసులు చేధించారు. ముంబైతో పాటు ఇతర ప్రాంతాల నుంచి అందమైన అమ్మాయిలను తీసుకొచ్చి వ్యభిచారం చేయిస్తున్న ముఠా ఆట కట్టించారు. ఈ క్రమంలోనే నిర్వాహకుడితో పాటు ఆరుగురు సెక్స్‌వర్కర్లు, నలుగురు విటులను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు.రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాటేదాన్‌ ప్రాంతంలో రాజస్థాన్‌కు చెందిన దీపక్ అనే వ్యక్తి కొన్నాళ్లుగా నివాసముంటున్నాడు. సులభంగా డబ్బు సంపాదించాలన్న దురుద్దేశంతో వ్యభిచారం చేయడం ప్రారంభించాడు. 
హైదరాబాద్ భారీ సెక్స్ రాకెట్ గుట్టురట్టు

ఉప్పర్‌పల్లిలోని సన్‌రైజ్ కాలనీలో ఓ ఇంటిని అద్దెకు తీసకుని అమ్మాయిల శరీరాలతో వ్యాపారం చేస్తున్నాడు. ముంబై నుంచి అందమైన యువతులను రప్పించి గుట్టుగా సెక్స్ రాకెట్ నిర్వహిస్తున్నాడు.ఆ ఇంటికి రోజూ పదుల సంఖ్యలో యువకులు వస్తుండటంతో అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో కొద్దిరోజులుగా పోలీసులు ఆ ఇంటిపై నిఘా పెట్టి వ్యభిచారం జరుగుతోందని నిర్ధారించారు. ఆదివారం రాత్రి ఆ ఇంటిపై రైడ్ చేసి ఆరుగురు సెక్స్‌వర్కర్లను రక్షించారు. దీపక్‌తో పాటు నలుగురు విటులను అరెస్ట్ చేసి పీఎస్‌కు తరలించారు. ఇటీవల హైదరాబాద్‌లో ఇటీవల వ్యభిచార ముఠాల కార్యకలాపాలు పెరిగిపోయాయి. పోలీసులు అడపాదడపా కొన్నింటిని గుర్తించి పట్టుకుంటున్నా.. నిర్వాహకులు ఏమాత్రం తగ్గడం లేదు. ఎప్పటికప్పుడు నూతన విధానాలతో విటులను ఆకర్షిస్తూ వ్యాపారం సాగిస్తున్నారు. ఇటీవల బేగంపేటలోని లిస్బన్ పబ్‌లో వెలుగుచూసిన సెక్స్ వ్యాపారం నగరంలో తీవ్ర చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే.

No comments:

Post a Comment