Breaking News

05/12/2019

దవాఖానాల్లో కార్డియాలజీ విభాగం

నల్గొండ, డిసెంబర్ 5, (way2newstv.in)
రాష్ర్టంలో చిన్న పెద్ద తేడా లేకుండా గుండె జబ్బుల బారిన పడుతున్నారు. ఏటా వేల మంది హార్ట్ ఎటాక్తో ప్రాణాలు కోల్పోతున్నారు. సరైన సమయంలో గుండె పోటు ముప్పును గుర్తించకపోవడంతో మరణాలు పెరుగుతున్నాయి.ఈ నేపథ్యంలో రాష్ర్టవ్యాప్తంగా 23 దవాఖాన్లలో కార్డియాలజీ టీమ్స్‌‌‌‌‌‌‌‌ను ఏర్పాటు చేయాలని సర్కారు నిర్ణయించింది. ఇప్పటికే ఆయా ఆస్పత్రులను గుర్తించిన ప్రభుత్వం.. త్వరలోనే ట్రైనింగ్ ఇవ్వనుంది.రాష్ర్టవ్యాప్తంగా వందల సంఖ్యలో సర్కారు దవాఖాన్లు ఉన్నా.. కార్డియాలజీ సేవలు మాత్రం కేవలం 3 హాస్పిటళ్లకే పరిమితమయ్యాయి. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని గాంధీ, ఉస్మానియా, వరంగల్ ఎంజీఎంలోనే కార్డియాలజిస్టులు ఉన్నారు. గుండె నొప్పితో ఎవరైనా సర్కారు దవాఖానకు వస్తే గాంధీకో, ఉస్మానియాకో రిఫర్ చేస్తున్నారు. 
దవాఖానాల్లో కార్డియాలజీ విభాగం

వందల కిలోమీటర్లు ప్రయాణంలో విలువైన సమయం వృథా అయి బాధితులు ప్రాణాలు కోల్పోతున్నారు. దీంతో జిల్లాల్లోని దవాఖాన్లలోనూ గుండె పోటు బాధితులకు ప్రథమ చికిత్స అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. హార్ట్ ఎటాక్ను గుర్తించేందుకు రాష్ర్టవ్యాప్తంగా 23 దవాఖాన్లలో ఈసీజీ సహా అవసరమైన ఎక్విప్‌‌‌‌‌‌‌‌మెంట్స్ను అందుబాటులో ఉంచనుంది. 8 జిల్లా హాస్పిటళ్లు, 7 ఏరియా హాస్పిటళ్లు, 8 కమ్యునిటీ హెల్త్ సెంటర్లను అధికారులు ఇందుకోసం ఎంపిక చేశారు.కార్డియాలజిస్ట్‌‌‌‌‌‌‌‌లకు బదులు ఆయా దవాఖాన్లలో ఉండే డాక్టర్లే ప్రైమరీ ట్రీట్‌‌‌‌‌‌‌‌మెంట్ ఇవ్వనున్నారు. ఒక్కో దవాఖానలో ముగ్గురు స్పెషలిస్ట్ డాక్టర్లు, ఇద్దరు నర్సులతో బృందాలను ఏర్పాటు చేస్తున్నారు. త్వరలోనే ఈ బృందాలకు అవసరమైన శిక్షణ ఇవ్వనున్నారు. ఈసీజీ తీయడం, రక్తనాళాల్లో క్లాట్స్‌‌‌‌‌‌‌‌ను తొలగించే థ్రాంబోలైటిక్‌‌‌‌‌‌‌‌ ఇంజెక్షన్‌‌‌‌‌‌‌‌, డ్రగ్స్‌‌‌‌‌‌‌‌ ఇవ్వడం, హార్ట్‌‌‌‌‌‌‌‌బీట్‌‌‌‌‌‌‌‌ను నియంత్రించేందుకు షాక్‌‌‌‌‌‌‌‌ ట్రీట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ ఇవ్వడం వంటివన్నీ ఈ బృందాలకు నేర్పిస్తారు. థ్రాంబోలైటిక్ ఇంజక్షన్‌‌‌‌‌‌‌‌ ఇచ్చినప్పుడు హార్ట్‌‌‌‌‌‌‌‌ బీట్ చాలా వేగంగా మారుతుంది. దీన్ని కంట్రోల్ చేసేందుకు షాక్ ట్రీట్‌‌‌‌‌‌‌‌మెంట్ ఇస్తారు. ఈ చర్యలతో ఒకరోజు పాటు పేషెంట్‌‌‌‌‌‌‌‌ ప్రాణాలను కాపాడొచ్చని డాక్టర్లు చెబుతున్నారు.దవాఖాన్లలో తీసే ఈసీజీ రిపోర్ట్‌‌‌‌‌‌‌‌ను విశ్లేషించి, గుండె పోటు ముప్పు ఉందో లేదో నిమిషాల్లో తెలుసుకునేందుకు బెంగళూరు‌‌‌‌‌‌‌‌కు చెందిన ట్రైకాగ్ సంస్థతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలుస్తోంది. ‘‘దవాఖానలో ఈసీజీ తీయగానే, ఆ రిపోర్ట్‌‌‌‌‌‌‌‌ నేరుగా ట్రైకాగ్ సంస్థకు చేరుతుంది. వాళ్లు 5 నిమిషాల్లో దాన్ని విశ్లేషించి, రిజల్ట్‌‌‌‌‌‌‌‌ పంపిస్తారు’’ అని సంబంధిత అధికారి ఒకరు వెల్లడించారు. ఈసీజీ విశ్లేషణకు ఈ సంస్థ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌‌‌‌‌‌‌‌తో పని చేసే సాఫ్ట్‌‌‌‌‌‌‌‌వేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రూపొందించింది.కేవలం టెక్నాలజీపైనే ఆధారపడకుండా, 24 గంటల పని చేసే ఎక్స్‌‌‌‌‌‌‌‌పర్ట్ టీమ్‌‌‌‌‌‌‌‌ కూడా ఉంటుందని ఆ అధికారి వివరించారు.హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ నుంచి ఆదిలాబాద్ వరకూ సూపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్పెషాలిటీ సేవలందిస్తున్న ప్రైవేటు హాస్పిటళ్లు పదుల సంఖ్యలో ఉన్నప్పటికీ, సర్కారీ సేవలు మాత్రం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌కే పరిమితమయ్యాయి. కేవలం ఉస్మానియా, గాంధీలో మాత్రమే క్యాథల్యాబ్స్ ఉన్నాయి. పేషెంట్‌‌‌‌‌‌‌‌కు ప్రైమరీ ట్రీట్‌‌‌‌‌‌‌‌మెంట్ చేసిన తర్వాత, అంబులెన్స్‌‌‌‌‌‌‌‌లో ఈ రెండింట్లో ఒక హాస్పిటల్‌‌‌‌‌‌‌‌కు పంపిస్తారు. ఇక్కడ రోగికి పూర్థిస్థాయిలో చికిత్స అందిస్తారు. అయితే మరో రెండు టీచింగ్ హాస్పిటళ్లలోనూ క్యాథల్యాబ్స్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఒక్కో ల్యాబ్‌‌‌‌‌‌‌‌ ఏర్పాటుకు రూ.4 కోట్ల వరకూ ఖర్చవుతుందని డాక్టర్లు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నేషనల్ హెల్త్ మిషన్ నిధులను ఇందుకు వినియోగించుకోవాలని ఎన్‌‌‌‌‌‌‌‌హెచ్‌‌‌‌‌‌‌‌ఎం అధికారులు భావిస్తున్నారు. ఇందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్టు తెలిసింది

No comments:

Post a Comment