అనంతపురం డిసెంబర్ 19 (way2newstv.in):
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వద్దూ.. ఆ పార్టీ నేతలు ఉండకూడదని ఆనాడు తాను అనుకుంటే.. వైసీపీలో ఒక్కరు కూడా మిగిలేవారు కాదని, ఆ విషయం వాళ్లు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు అన్నారు.
తాను తలసుకుంటే.. వైసీపీలో ఒక్కరు కూడా మిగిలేవారు కాదు: చంద్రబాబు
వైసీపీ నేతలు దున్నపోతులు మాదిరిగా రోడ్డుమీద పడి ఇష్టమొచ్చినట్లు చేయాలని అనుకుంటున్నారని.. అయితే ఇక్కడొక సమస్య ఉందని, ఒక రాజకీయ పార్టీ, ఇంకొక రాజకీయ పార్టీ కొట్లాడుకుంటే.. ఎవరి బలం ఏంటో తేలిపోతుందని అన్నారు. వాళ్ల ప్రాణం వారికెంతో ముఖ్యమో.. మన ప్రాణం కూడా మనకు అంతే ముఖ్యమని, ఈ విషయం వాళ్లు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని చంద్రబాబు అన్నారు.
No comments:
Post a Comment