త్వరలో 3.40 లక్షల మందికి కూడా న్యాయం చేస్తాం
త్వరలో కేశవరెడ్డి బాధితులకు కూడా న్యాయం చేస్తాం
- హోంమంత్రి మేకతోటి సుచరిత
అమరావతి డిసెంబర్ 11 (way2newstv.in)
ఏపీ, తెలంగాణ, ఇతర రాష్ట్రాల్లో అమాయక ప్రజల నుంచి అధిక వడ్డీ ఆశ చూపిస్తూ.. దానికి బదులుగా భూమి రిజిష్టర్ చేసి ఇస్తామని అగ్రిగోల్డ్ కంపెనీ భారీగా డిపాజిట్లు సేకరించడం జరిగిందని శాసనసభలో హోంమంత్రిమేకతోటి సుచరిత తెలిపారు.దాదాపుగా 11,57,497 మంది డిపాజిటర్లు ఉన్నారని ఆమె తెలిపారు. రూ.3,944.70 కోట్ల మొత్తాలు ఏపీకి సంబంధించి ఉన్నాయని అన్నారు. వివిధ జిల్లాల్లో 15 కేసులు నమోదు అయ్యాయి. వీటిపై సీఐడీ దర్యాప్తు చేయటం జరిగిందన్నారు. అన్ని కేసుల్లో ఛార్జిషీటు దాఖలు చేయటం జరిగిందని హోంమంత్రి సభలో తెలిపారు.
అగ్రిగోల్డ్ బాధితులకు రూ.1150 కోట్లు కేటాయింపు
11 కేసుల్లో విచారణ పెండింగ్లో ఉందని అన్నారు.అగ్రిగోల్డ్ స్థిర, చర ఆస్తులకు సంబంధించి 15 ప్రభుత్వ ఉత్తర్వుల ద్వారా జప్తు చేయటం జరిగిందని హోంమంత్రి తెలియజేశారు. జప్తు చేసిన ఆస్తుల మొత్తం ఎస్ఆర్ఓ విలువ రూ.3785 కోట్లు అని తెలిపారు. రూ.20 వేలు అంతకంటే తక్కువ డిపాజిట్ చేసిన డిపాజిటర్లకు ఆ మొత్తాలు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం జరిగిందన్నారు. 2019-20 బడ్జెట్కు సంబంధించి ఆర్థిక సంవత్సరానికి రూ.1150 కోట్లు బడ్జెట్ కేటాయించడం జరిగిందన్నారు. మొదటి విడతగా రూ.10వేలు అంతకంటే తక్కువ డిపాజిట్ చేసిన ఆంధ్రప్రదేశ్లోని 3,69,655 మంది డిపాజిటర్లకు ఈ మొత్తాన్ని పంపిణీ చేయటానికి 18.10.2019 హోంశాఖ జీఓ నెం.891 ద్వారా రూ.263కోట్ల 99 లక్షల 983 లు మంజూరు చేయటం జరిగిందన్నారు. ఈ మొత్తాన్ని ఇప్పటికే మొదటి విడతలో బాధితులకు పంపిణీ చేయటం జరిగిందన్నారు. రూ.20వేలు అంతకంటే తక్కువ డిపాజిట్దారులకు ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ కేటాయింపులో భాగంగా 3.40 లక్షల మందికి త్వరలో అందజేయటం జరుగుతుందని హోంమంత్రి మేకతోటి సుచరిత తెలిపారు.కేశవరెడ్డి బాధితులకు కూడా న్యాయంహోం మంత్రి మాట్లాడుతూ కేశవరెడ్డి బాధితుల గురించి సభ్యులు ప్రస్తావించారని.. ఇందులో ముద్దాయి అయిన నాగిరెడ్డి కేశవరెడ్డిని అరెస్ట్ చేయటం జరిగిందన్నారు. వీరిపై 13 కేసులు దీనిపై నమోదు అయ్యాయి. దానికి సంబంధించి భూములు, వాహనాలు స్వాధీనం చేసుకోవటం జరిగింది. దీనిపై రివిజన్ పిటీషన్ హైకోర్టులో వేయటం జరిగింది వారికి కూడా న్యాయం చేస్తామని సుచరిత స్పష్టం చేశారు.
No comments:
Post a Comment