పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్
హైదరాబాద్ నవంబర్ 29 (way2newstv.in)
వాహనాలపై వెళ్లేటప్పుడు బైక్ పంచర్ లాంటి సమస్యలు తలెత్తితే వెంటనే పోలీసుల సహాయం తీసుకోవాలని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ సూచించారు. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు పోలీసులకు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
వాహనం పాడైతే మాకు ఫోన్ చేయండి!
స్థానిక పోలీసులు వెంటనే స్పందించి వాహనాన్ని మరమ్మతు చేయించడం లేదా గమ్యస్థానానికి సురక్షితంగా చేర్చడంలో తోడ్డాటునందిస్తారన్నారు. ఈ మేరకు పోలీసు కంట్రోల్ రూం నెం.100కు కాల్ చేసి సమాచారం ఇవ్వాలని సూచించారు. 9490617111 వాట్సప్ నెంబర్కి లొకేషన్ కూడా షేర్ చేయ్యొచ్చని తెలిపారు. తాజాగా షాద్నగర్లో జరిగిన వెటర్నరీ డాక్టర్ ప్రియాంకరెడ్డి హత్య కేసుతో పాటు నగర శివారులో హత్యోదంతాలు పెరిగిపోతున్న నేపథ్యంలో మహేశ్ భగవత్ ఈ సూచనలు చేశారు.
No comments:
Post a Comment