Breaking News

14/11/2019

రఫేల్‌ యుద్ధ విమానాల కొనుగోలు కేసులో కేంద్రానికి ఊరట

న్యూఢిల్లీ నవంబర్ 14   (way2newstv.in)
 రఫేల్‌ యుద్ధ విమానాల కొనుగోలు వ్యవహారం కేసులో కేంద్రానికి ఊరట లభించింది. రఫేల్‌ సమీక్ష పిటిషన్లన్నింటిని కోర్టు తిరస్కరించింది. రఫేల్‌పై గతంలో ఇచ్చిన తీర్పును సమీక్షించాల్సిన అవసరం లేదని కోర్టు స్పష్టం చేసింది. ఫ్రాన్స్‌కు చెందిన దసాల్ట్ ఏవియేషన్ సంస్థ నుంచి 36 రఫేల్‌ యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించిన ఒప్పందంలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై విచారించిన సుప్రీంకోర్టు 2018, డిసెంబర్‌ 14న సంబంధిత పిటిషన్లను కొట్టివేస్తూ తీర్పునిచ్చింది. 
రఫేల్‌ యుద్ధ విమానాల కొనుగోలు కేసులో కేంద్రానికి ఊరట

సుమారు రూ.59,000 కోట్ల విలువైన ఈ ఒప్పందంలో అక్రమాలు జరిగాయని, కోర్టు పర్యవేక్షణలో దీనిపై విచారణ జరుపాలని దాఖలైన అన్ని పిటిషన్లను కోర్టు నాడు కొట్టివేసింది. అయితే తీర్పును సమీక్షించాలని కోరుతూ కేంద్ర మాజీ మంత్రులు యశ్వంత్ సిన్హా, అరుణ్ శౌరీ, సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ పిటిషన్లు దాఖలుచేశారు. ఈ ఒప్పందంలో పలు కీలక విషయాలను కోర్టుకు చెప్పకుండా కేంద్రం దాచిపెట్టిందనివారు ఆరోపించారు.ఇందులో భారత్‌తరఫున చర్చల బృందంలో పాల్గొన్న ముగ్గురుసభ్యుల అసమ్మతి పత్రం కూడా ఉన్నదని పేర్కొన్నారు. అయితే ఈ పత్రాలు రహస్యమని, అనధికారికంగా వీటిని సేకరించారని, వీటిని పరిగణనలోకి తీసుకోవద్దని కేంద్రం వాదించింది. అయితే కోర్టు కేంద్రం వాదనను తోసిపుచ్చింది. పిటిషన్లపై విచారణ జరిపిన కోర్టు.. గత మేలో తీర్పును రిజర్వ్‌లో పెట్టగా ఇవాళ తీర్పును వెల్లడించింది.

No comments:

Post a Comment