Breaking News

19/11/2019

వంశీకి స్వతంత్ర సభ్యుడి హోదా

విజయవాడ, నవంబర్ 19  (way2newstv.com)
జగన్ ప్లాన్ మారింది. వల్లభనేని వంశీ విషయంలో ఆయన స్ట్రాటజీ మార్చుకున్నట్లు కనపడుతోంది. వల్లభనేని వంశీ వైసీపీలో చేరాలంటే తొలుత పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. అయితే ఇప్పటికిప్పుడు రాజీనామా చేయాల్సిన అవసరం లేదని వైసీపీ అధినేత జగన్ అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. నిదానంగా పరిస్థితులకు అనుగుణంగా రాజీనామా వ్యవహారాన్ని చూడవచ్చని జగన్ భావిస్తున్నట్లు పార్టీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం.ఎట్టకేలకు గన్నవరం పంచాయతీని జగన్ తేల్చేశారు. గత కొంతకాలంగా వల్లభనేని వంశీ వ్యవహారం ఇటు వైసీపీలో, అటు టీడీపీలో హాట్ హాట్ గా నడిచింది. అయితే నిన్న గన్నవరం వైసీపీ ఇన్ ఛార్జి యార్లగడ్డ వెంకట్రావు జగన్ ను కలసిన తర్వాత కొంత క్లారిటీ వచ్చింది. 
వంశీకి స్వతంత్ర సభ్యుడి హోదా

యార్లగడ్డ వెంకట్రావు గన్నవరం నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. వల్లభనేని వంశీ వైసీపీలోకి వస్తానని ప్రకటించిన నాటి నుంచి యార్లగడ్డ వెంకట్రావు అసంతృప్తితో ఉన్నారని వార్తలు వచ్చాయి.అయితే ఈ నేపథ్యంలో యార్లగడ్డ వెంకట్రావుకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని జగన్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. గన్నవరం నియోజకవర్గాన్ని వల్లభనేని వంశీకి వదిలేయాని జగన్ సూచించినట్లు చెబుతున్నారు. ఇద్దరు కలసికట్టుగా పనిచేస్తే గన్నవరం నియోజకవర్గంలో తిరుగుండదని యార్లగడ్డకు జగన్ ఆదేశించినట్లు తెలుస్తోంది. వల్లభనేని వంశీ వ్యవహారాన్ని తనకు వదిలేయాలని, తాను చూసుకుంటానని జగన్ చెప్పినట్లు సమాచారం.వల్లభనేని వంశీ ఇప్పట్లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయరని జగన్ దాదాపుగా తేల్చేశారు. తొలుత శీతాకాల అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత టీడీపీ అనుసరించే స్ట్రాటజీ ప్రకారం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలా? వద్దా? అన్నది ఆలోచిద్దామని జగన్ అన్నట్లు తెలిసింది. ఎందుకంటే వల్లభనేని వంశీని టీడీపీ సస్పెండ్ చేయకపోతే మాత్రం ఎమ్మెల్యే పదవికి వల్లభనేని వంశీ చేత రాజీనామా చేయించాలనుకున్నారు. అయితే టీడీపీ సస్పెండ్ చేయడంతో ఆయనను స్వతంత్ర ఎమ్మెల్యేగా కొనసాగించాలన్న ఆలోచన కూడా చేస్తున్నారు. అనవసరంగా ఉప ఎన్నికల భారం మోపడమెందుకన్న ఆలోచనలో జగన్ ఉన్నట్లు చెబుతున్నారు. మొత్తం మీద గన్నవరం పంచాయతీకి జగన్ ఫుల్ స్టాప్ పెట్టేశారు.

No comments:

Post a Comment