Breaking News

29/11/2019

రుణమాఫీ లేదు.. రైతుబంధు రాదు..

మెదక్, నవంబర్ 29, (way2newstv.in)
బ్యాంకులు రైతులకు రూ.1194.09కోట్లు రుణాలివ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ధేశించగా, ఇచ్చింది 575.16కోట్లే. సిద్దిపేట జిల్లాలో రూ.1358కోట్లకుగాను ఇచ్చింది రూ.387కోట్లే, మెదక్‌ జిల్లాలో రూ.791.83కోట్లకుగాను ఇచ్చింది సుమారు రూ.474.6కోట్లు వరకు ఉండొచ్చని అధికారులు చెబుతున్నారు. ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి గరిష్ట లక్ష్యాలను నిర్దేశించినా బ్యాంకులు ముందుకు రాలేదు. ఇందులో ప్రధానంగా స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి రూ.362.49 కోట్ల లక్ష్యాన్ని నిర్ధేశించగా రూ.136.72కోట్లు మాత్రమే రుణాలిచ్చింది. రెండో అతిపెద్ద లక్ష్యాన్ని నిర్ధేశించిన తెలంగాణ గ్రామీణ వికాస్‌బ్యాంక్‌ 318.79కోట్ల లక్ష్యానికిగాను కేవలం రూ.81.62కోట్లు అందించింది. సిండికేట్‌ బ్యాంక్‌కు రూ.178.80 కోట్ల లక్ష్యాన్ని నిర్ధేశించగా రూ.85.36కోట్ల రుణాలు మంజూరు చేసింది. 
రుణమాఫీ లేదు.. రైతుబంధు రాదు..

ఆంధ్రా బ్యాంక్‌ రూ.49.62 కోట్లకుగాను రూ.40.41కోట్లు ఇచ్చింది. ఒక్క డీసీసీబీ మాత్రమే నిర్ధేశించిన లక్ష్యం కంటే అధికంగా 97.33కోట్లకుగాను రూ.138.45కోట్ల రుణాలు మంజూరు చేసింది.సంగారెడ్డి జిల్లా కొండాపూర్‌ మండలం కోనాపూర్‌కు చెందిన రైతు రాజయ్య 2018లో అనంతసాగర్‌ ఏపీజీవీబీలో 90వేల రూపాయల రుణం తీసుకున్నాడు. తన మూడెకరాల్లో పంటలు దిగుబడి సరిగా లేకపోవడంతో అప్పు అలాగే ఉంది. ఎన్నికలకు ముందు కేసీఆర్‌ రుణమాఫీ చేస్తానని చెప్పడంతో సంతోషపడ్డాడు. తర్వాత ఖరీఫ్‌లో పెట్టుబడుల కోసం వెళ్తే రుణం ఇవ్వబోమని బ్యాంకర్లు చెప్పారు. చేసేదే మీ లేక బయట రూ.లక్ష అప్పుతెచ్చి పెట్టుబడులు పెట్టాడు. ఇప్పుడవి వడ్డీతో కలిపి రూ.1.50లక్షలు అయ్యాయి. రైతుబంధు డబ్బులు కూడా ఇంతవరకు ఇవ్వలేదు. పంట రుణమిస్తే వడ్డీలు కట్టాల్సిన పరిస్థితి వచ్చే ది కాదని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. గంగారం గ్రామానికి చెందిన రైతు సంజీవులు కూడా గతంలో బ్యాంకులో రూ.90వేలు తీసుకున్నాడు. ఖరీఫ్‌ పంట రుణం ఇవ్వకపోవడంతో రూ.2లక్షలు ప్రయివేటుగా అప్చు చేశాడు. బ్యాంకోళ్లు రుణం కట్టాలని ఒత్తిడి తెస్తున్నారు. ప్రభుత్వం రుణమాఫీ చేస్తుందనే ఆశతో ఉన్నాడు. ఇలా ఒక్కరిద్దరే కాదు సుమారు 30వేలమంది రైతులదీ ఇదే పరిస్థితి. సంగారెడ్డి, మెదక్‌, సిద్దిపేట జిల్లాల్లో సాగు సాధారణ విస్తీర్ణం 90వేల ఎకరాలు కాగా, ఈసారి లక్ష ఎకరాలు సాగవుతుందని అధికారుల అంచనా.రు

No comments:

Post a Comment