Breaking News

28/11/2019

పవన్ కళ్యాణ్ పై విజయసాయి మండిపాటు

అమరావతి నవంబర్ 28  (way2newstv.in)
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వైఎస్ఆర్సిపి ఎంపీ విజయసాయి రెడ్డి మరోసారి తీవ్ర విమర్శలు చేశారు.  గత అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా రెండు నియోజక వర్గాల్లో పొటీచేసి ఓడిపోయారని, జనసేనలో ఒక ఎమ్మెల్యే ఉన్నా లేనట్టేనని విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు.  కాగా సినీ నటుడు వస్తున్నాడంటే నలుగురు పోగవుతారు.  
పవన్ కళ్యాణ్ పై విజయసాయి మండిపాటు

మీ యొక్క తమాషా చూద్దామని జనం వస్తే అర్థం పర్థం లేని డైలాగులు దంచుతారు .  జనసేన పార్టీ నిర్మాణం లేదు, రెండు చోట్లా పోటీ చేసి చిత్తుచిత్తుగా ఓడిపోయిన పవన్ కళ్యాణ్ ప్యాకేజీ కోసం వీధి ప్రదర్శనలిస్తున్నాడని విమర్శించారు.  అటువంటి నాయకులకు సానుభూతి చూపడం తప్ప ఏం చేయగలం అని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు.

No comments:

Post a Comment